మిస్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్..?

Tuesday,April 04,2017 - 03:51 by Z_CLU

మిస్టర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి ఆల్ సెట్ అయింది. వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, హేబా పటేల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కింది. ఏప్రిల్ 13 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ఫ్యాన్స్ కాన్సంట్రేషన్ మాత్రం మిస్టర్ రిలీజ్ కన్నా ముందు ఏప్రిల్ 7 న   జరగనున్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ పైనే ఉంది.

ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మెగాస్టార్ కూడా అటెండ్ అవుతాడా..? అంటే పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతున్నాయి ఇన్ సైడ్ సోర్సెస్. వరుణ్ తేజ్ ప్రతి సినిమాని అంతే కేరింగ్ గా ప్రమోట్ చేసే చిరు, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాడని తెలుస్తుంది.

ఇప్పటికే రిలీజ్ అయిన ట్రేలర్స్, సాంగ్స్ ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కి కావాల్సినంత పాజిటివ్ టాక్ ని కలెక్ట్ చేసి పెట్టాయి. దానికి తోడు ఈ ఈవెంట్ లో మెగాస్టార్ కూడా అటెండ్ అయితే సినిమా సక్సెస్ గ్యారంటీ అని సర్టిఫికెట్ కూడా దొరికిపోతుంది. ఈ సినిమాని నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు కలిసి నిర్మిస్తున్నారు.