చెన్నైలో ల్యాండ్ అయిన మహేష్ బాబు టీమ్

Tuesday,April 04,2017 - 05:10 by Z_CLU

వియత్నాం షెడ్యూల్ కి సక్సెస్ ఫుల్ గా ప్యాకప్ చెప్పేసింది మహేష్ బాబు మురుగదాస్ టీమ్. అక్కడి నుండి ఇమ్మీడియట్ గా చెన్నై లో ల్యాండ్ అయిన ఈ సినిమా యూనిట్ ఏ మాత్రం గ్యాప్ లేకుండా నెక్స్ట్ షెడ్యూల్ తో సెట్స్ పైకి వచ్చేసింది. అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.

మహేష్ బాబు ఈ సినిమాలో ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. షూటింగ్ తప్ప కనీసం ఫస్ట్ లుక్, టీజర్స్ లాంటి వాటి జోలికి కూడా వెళ్ళకుండా ఫుల్ టైం ప్రొడక్షన్ పై ఫోకస్ పెట్టిన సినిమా యూనిట్, ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుని కి ప్యాకప్ చెప్పే ఆలోచనలో ఉంది. ఈ సినిమాకి హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.