రాజశేఖర్ సినిమాలో సన్నీలియోన్

Thursday,April 06,2017 - 07:50 by Z_CLU

ఆంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ సన్నీలియోన్ తో సెట్స్ పైకి వచ్చేశాడు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘పి.యస్.వి. గరుడవేగ’ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో ఎంటర్ టైన్ చేయనుంది సన్నీలియోన్. ఈ పాట ముంబాయి లోని ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది.

అల్టిమేట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజశేఖర్ ని స్టైలిష్ లుక్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. చందమామ కథలు, గుంటూర్ టాకీస్ లాంటి సినిమాలతో సక్సెస్ ఇమేజ్ ని బ్యాగ్ ని వేసుకున్న ఈ డైరెక్టర్, రాజశేఖర్ కం బ్యాక్ మూవీని పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్నాడు.