బన్ని సరసన కొత్త హీరోయిన్

Tuesday,April 04,2017 - 02:49 by Z_CLU

DJ కి ఇలా ప్యాకప్ చెప్తాడో లేదో బన్ని వక్కంతం వంశీ సినిమాతో సెట్స్ పై ఉంటాడు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్లాన్ చేసుకుంటున్న బన్ని, ఓ వైపు DJ తో బిజీగా ఉంటూనే మరో వైపు వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఆల్ మోస్ట్ ఫిక్స్ అయిపోయిన ‘ నా పేరు సూర్య’ సినిమాపై కూడా దృష్టి పెట్టాడు.

 

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ ని బిగిన్ చేసేసిన సినిమా యూనిట్,  బన్ని హీరోయిన్ ని ఆల్ మోస్ట్ ఫిక్స్ చేసేసుకున్నట్టే అనిపిస్తుంది. రీసెంట్ గా  కన్నడలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కిరిక్ పార్టీ’ హీరోయిన్ రష్మిక ని ఈ సినిమాకోసం ప్రిఫర్ చేస్తున్నారని తెలుస్తుంది. అఫీషియల్ గా అనౌన్స్ అయితే చేయలేదు కానీ, బన్ని కూడా ఆల్ మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు అని టాక్. మరి ఈ అప్ డేట్ ఎంతవరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ గా ట్రాన్స్ ఫామ్ అవుతుందో చూడాలి.