మాకేంటి అనుకోవద్దు

Saturday,April 08,2017 - 02:00 by Z_CLU

వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘మిస్టర్’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 14న థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా ప్రీ రిలీజ్ వేడుక ను నిర్వహించారు మేకర్స్.. ఈ ఈవెంట్ కి మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరై మెగా ఫాన్స్ లో జోష్ నింపారు.. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ” నేను వరుణ్ తేజ్ కి ఒక్కటే చెప్తుంటా వెనకాల మేమంతా వున్నాం ఆ వెనకాల అభిమానులంతా ఉన్నారు మాకెంట్లే.. అన్న భావన తాగి కాకుండా వచ్చిన అవకాశాన్ని మన కష్టం తో సద్వినియోగ పరుచుకోవాలి ప్రతీ సినిమా మొదటి సినిమాలాగే కష్టపడి పనిచేయాలి..అప్పుడే ఈ అభిమానులను నిలబెట్టుకోగలుగుతాం..

అలాగే మాకు కూడా గర్వకారణం అవుతునావ్ సో కష్టాన్నే నమ్ముకో అంటూ చెప్తుంటా..నిజానికి వరుణ్ చాలా జాగ్రత్త గా ఏది బడితే అది ఉప్పుకోకుండా చాలా ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నాడు.. ఈ సందర్భంగా వరుణ్ ని అభినందిస్తున్నా. ఈ సినిమా కచ్చితంగా ఘన విజయం సాధించాలని ఆశిస్తున్నా “అంటూ వరుణ్ తేజ్ ను అభినందించారు చిరు..