హీరోయిన్స్ లో అఖిల్ క్రేజ్

Saturday,April 08,2017 - 12:32 by Z_CLU

సినిమాల్లోకి రాక ముందే తన లుక్స్ తో హీరోయిన్స్ ను ఎట్రాక్ట్ చేసిన అక్కినేని హ్యాండ్సమ్ హీరో అఖిల్ కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చాక ఆ క్రేజ్ ను మరింతగా పెంచుకుంటూ దూసుకుపోతున్నాడు. చేసింది ఒకే సినిమా అయినప్పటికీ ఈ హీరో అంటే మరింత ఆసక్తి చూపిస్తున్నారు మన టాలీవుడ్ కథానాయికలు. సిసింద్రీ బర్త్ డే సందర్భంగా స్పెషల్ స్టోరీ.

mgk_43370243

ప్రతి ఆడియో వేడుకలో కథానాయికలతో కలిసి హైలైట్ గా నిలుస్తున్నాడు అఖిల్. నాగచైతన్య నటించిన ‘ప్రేమమ్’ సినిమా ఆడియో ఫంక్షన్ లో  మరోసారి అందర్నీ తనవైపు తిప్పుకున్నాడు ఈ సిసింద్రీ. ఈ చిత్రంలో చైతు హీరో అయినప్పటికీ ఆడియో వేడుకలో మాత్రం అఖిల్ పక్కనే కూర్చోవడానికి ఇంట్రెస్ట్ చూపించింది శృతిహాసన్. కేవలం కూర్చోవడమే కాకుండా అఖిల్ తో ఒకటే ముచ్చట్లు.

akhil-kajal

కేవలం శృతి హాసనే కాదు రకుల్,కాజల్, రెజీనా కూడా ఇదే కోవలోకి వస్తారు. సీసీఎల్ లో అఖిల్ ఆట చూసి ఫిదా అయిపొయింది కాజల్. ఆ సందర్భంలోనే అఖిల్ కి క్లోజ్ అయింది ఈ ముద్దుగుమ్మ.

akhil-regina

ఆ మధ్య ఓ ఈవెంట్ కి అఖిల్ తో పాటు రకుల్, రెజీనా ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. అప్పుడు అఖిల్ తో చాలాసేపు చిట్ చాట్ పెట్టింది రెజీనా. అంతేకాదు ఈవెంట్ జరుగుతున్నంత సేపు అఖిల్ ను చూస్తూనే ఉంది ఈ భామ.

akhil-and-rakul-preet-singh-launch-south-india-shopping-mall-17

ఇక ఈమధ్యేే ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి అఖిల్ తో పాటు ముఖ్య అతిథిగా హాజరైంది రకుల్. ఈవెంట్ జరుగుతున్నంతసేపు అఖిల్ ను వదల్లేదు. రకుల్ అఖిల్ తో ఇంతలా మాట్లాడడం చూసి అఖిల్ రెండో సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ఈ అమ్మడు కాసింత ఆసక్తి చూపిస్తుందనే టాక్ కూడా ఫిలింనగర్ లో గట్టిగానే వినిపిస్తోంది.

ఇలా అఖిల్ ఏ వేడుకకు హాజరైనా అక్కడ కథానాయికలతో ముచ్చటిస్తూ ఆ ఈవెంట్ కి మెయిన్ ఎట్రాక్షన్ గా మారిపోతున్నాడు. వీళ్లంతా అఖిల్ తో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారు.