మహేష్ బాబు సినిమా వదులుకుంటానా..?

Wednesday,September 11,2019 - 07:04 by Z_CLU

మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ లో మీనాక్షి దీక్షిత్ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఇది ఈ సినిమా చుట్టూ.. అందునా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ చుట్టూ తిరుగుతున్న రూమర్స్ లో ఒకటి…ఈ వరసలో జస్ట్ మీనాక్షి ఒక్కత్తే కాదు… తమన్నా, పూజాహెగ్డే ల పేర్లు కూడా అంతే గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే వీరిలో మీనాక్షి దీక్షిత్ ఈ రూమర్స్ కి రెస్పాండ్ అయింది.

ప్రస్తుతానికి ‘సరిలేరు నీకెవ్వరు’ స్పెషల్ సాంగ్ కోసం తనను ఎవరూ అప్రోచ్ అవ్వలేదని సోషల్ మీడియా ద్వారా  క్లారిటీ ఇచ్చింది మీనాక్షి. రీసెంట్ గా ‘మహర్షి’ సినిమాలో కూడా నిధి క్యారెక్టర్ లో తళుక్కుమన్న ఈ బాలీవుడ్ భామ, సూపర్ స్టార్ సినిమాలో అవకాశం వస్తే మాత్రం అస్సలు వదులుకోను అని కూడా చెప్పుకుంది.

దీన్ని బట్టి మీనాక్షి ఈ సినిమా స్పెషల్ సాంగ్ కోసం ఎనీ టైమ్ రెడీ అన్నట్టే అనిపిస్తుంది. మరి మేకర్స్ మీనాక్షి ఇంట్రెస్ట్ ని గమనించి కన్సిడర్  చేస్తారా…? లేకపోతే పూజా హెగ్డే, తమన్నా స్థాయి హీరోయిన్ నే ప్రిఫర్ చేస్తారా..? చూడాలి…