‘గ్యాంగ్ లీడర్’ కి లైన్ క్లియర్

Wednesday,September 11,2019 - 03:47 by Z_CLU

నాని ‘గ్యాంగ్ లీడర్’ కి లైన్ క్లియర్ అయింది. ఈ కామెడీ బేస్డ్ రివేంజ్ ఎంటర్ టైనర్ సెన్సార్ క్లియర్ చేసుకుని U/A సర్టిఫికెట్ పొందింది. మరో 2 రోజుల్లో థియేటర్స్ లోకి రానుంది ఈ సినిమా. పెన్సిల్ పార్థసారథి గా ఎంటర్ టైన్ చేయబోతున్నాడు నాని ఈ సినిమాలో.

టాలీవుడ్ లో రివేంజ్ ఎంటర్ టైనర్స్ కామనే కానీ, ఈసారి రివేంజ్ కి కామెడీని జోడించి డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేయబోతున్నాడు దర్శకుడు విక్రమ్. ‘గ్యాంగ్ లీడర్’ పై ఈ స్థాయిలో బజ్ పెరగడానికి ‘నాని’ తరవాత మోస్ట్ ఎట్రాక్టివ్ పాయింట్ ఇదే. దానికి తోడు హీరోగా ఇప్పటికే సినిమాలు చేస్తూ యూత్ లో క్రేజ్ ఉన్న కార్తికేయ ఈ సినిమాలో విలన్ గా నటించడంతో ‘గ్యాంగ్ లీడర్’ సమ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాగా ఆడియెన్స్ లో క్రేజ్ క్రియేట్ చేస్తుంది.

అనిరుద్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, సి.వి.మోహన్‌ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు.