రేపే గ్రాండ్ రిలీజ్

Thursday,June 15,2017 - 03:08 by Z_CLU

‘మలుపు’, ‘సరైనోడు’ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఆది పినిశెట్టి హీరోగా ఎడ్వెంచరస్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సినిమా ‘మరకతమణి’ శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రిషి మీడియా బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా రేపటి నుంచి థియేటర్స్ లో సందడి చేయబోతుంది. ఆది సరసన నిక్కి గ‌ర్లాని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దిబు నైనన్‌ థామస్‌ సంగీతం అందించాడు.

ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్ సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేయడంతో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. ఐదుగురి క్యారెక్టర్స్‌ను బేస్‌ చేసుకుని స్క్రిప్ట్‌ బేస్‌డ్‌ మూవీ గా రూపొందిన ఈ సినిమాలో కొన్ని విజువల్స్, ఇంట్రెస్టింగ్ సీన్స్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎంటర్టైన్ చేస్తాయంటున్నారు మేకర్స్.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రేపటి నుంచి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనుంది.