అఖిల్ హీరోయిన్ ఎవరు?

Thursday,June 15,2017 - 04:00 by Z_CLU

విక్రమ్ కుమార్ తో అఖిల్ లేటెస్ట్ సినిమా సెట్స్ పైకొచ్చి 2 నెలలు దాటేసింది. ముందుగా ఈ సినిమాలో అఖిల్ సరసన మేఘ ఆకాష్ పేరు వినిపించింది. తర్వాత అనుపమ పరమేశ్వరన్ పేరు కూడా చక్కర్లు కొట్టింది. తాజాగా శ్రీదేవి కూతురు ఖుషీ కపూర్ పేరు కూడా వినిపించింది. కానీ ఇవేవీ వర్కవుట్ కాలేదు. అఖిల్ సరసన హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు.

అతిలోకసుందరి శ్రీదేవి చిన్నకూతురు ఖుషీని టాలీవుడ్ కు తీసుకొస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అఖిల్ కోసం నాగార్జున ఈ ప్రయత్నాల్లో ఉన్నాడంటూ పుకార్లు వచ్చాయి. వీటిపై నాగార్జున స్వయంగా రియాక్ట్ అయ్యాడు. అవన్నీ నిజం కాదని తేల్చేశాడు.

నాగ్ ప్రకటతో అఖిల్ హీరోయిన్ మేటర్ మొదటికొచ్చింది. కేవలం నిర్మాతగానే కాకుండా, అఖిల్ తండ్రిగా ఈ సినిమాపై చాలా కేర్ తీసుకుంటున్నాడు నాగ్. ఒకటికి పదిసార్లు ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటున్నాడు. అందుకే హీరోయిన్ సెలక్షన్ లేట్ అవుతోంది. త్వరలోనే దర్శకుడు విక్రమ్ కుమార్, నాగ్ కలిసి కూర్చొని, చర్చించి ఓ హీరోయిన్ పేరును ఖరారు చేయబోతున్నారు.