Weekend Release - ఈవారం 7 సినిమాలు

Thursday,September 02,2021 - 03:31 by Z_CLU

ఈవారం థియేటర్లలో 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో 5 స్ట్రయిట్ మూవీస్ కాగా, 2 డబ్బింగ్ సినిమాలు. ఆ మూవీస్ డీటెయిల్స్ చెక్ చేద్దాం

అవసరాల శ్రీనివాస్ హీరోగా నటించిన సినిమా నూటొక్క జిల్లాల అందగాడు. ఈ వారం కాస్త బజ్ తో వస్తున్న సినిమా ఇదే. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్ గా నటించింది. సినిమాలో మెయిన్ థీమ్ బట్టతల. దాన్ని దాచేందుకు హీరో ఎలాంటి ఇబ్బందలు పడ్డాడు, ప్రేయసికి అసలు విషయం తెలిసిన తర్వాత ఎలాంటి కష్టాలు ఫేస్ చేశాడు లాంటి అంశాలతో ఎంతో ఫన్నీగా, ఇంకాస్త ఎమోషనల్ గా ఈ సినిమాను తీశారు. శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, క్రిష్ స‌మ‌ర్ప‌ణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి `నూటొక్క జిల్లాల‌ అంద‌గాడు` చిత్రాన్ని నిర్మించారు.

నూటొక్క జిల్లాల అందగాడికి పోటీగా వస్తోంది డియర్ మేఘ. ఈవారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో కాస్త గట్టిగా ప్రచారం చేసిన సినిమా ఇదే. అరుణ్ అదిత్, మేఘా ఆకాష్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను అర్జున్ దాస్యన్ నిర్మించాడు. సుశాంత్ రెడ్డి దర్శకుడు. అర్జున్ సోమయాజులు, పవిత్ర లోకేష్ కీలక పాత్రల్లో కనిపిస్తారు.

కిల్లర్, అప్పుడు-ఇప్పుడు, అశ్మీ అనే మరో 3 సినిమాలు కూడా రేపే థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో కిల్లర్ సినిమా పక్కా సస్పెన్స్ థ్రిల్లర్ కాగా.. రొమాన్స్, కామెడీ ఎలిమెంట్స్ తో అప్పుడు-ఇప్పుడు సినిమా తెరకెక్కింది.

ఈ సినిమాలతో పాటు షెంగ్ ఛీ, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-9 అనే 2 డబ్బింగ్ సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలున్నాయి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics