మ‌ణిశ‌ర్మ‌ ఇంటర్వ్యూ

Wednesday,May 24,2017 - 04:20 by Z_CLU

మ‌ధుర ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై వంశీ డైర‌క్ష‌న్ లో మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి నిర్మిస్తున్న ‘ఫ్యాష‌న్ డిజైన‌ర్ s/o లేడీస్ టైలర్’ మూవీ జూన్ 2న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ అందించారు . ఈ సందర్భంగా మణి శర్మ మీడియా తో ముచ్చటించాడు.. ఆ విశేషాలు ఆయన మాటలలోనే…

 

ఇప్పటికి నెరవేరింది..

నేను ఇప్ప‌టివ‌ర‌కు 80-90 మంది డైర‌క్ట‌ర్ల‌తో క‌లిసి పనిచేశాను. కానీ ఇప్ప‌టివ‌ర‌కు వంశీ గారితో క‌లిసి పనిచేయలేక పోయా. ఆయన తో పనిచేయాలని ఎప్పటి నుంచో నా డ్రీమ్. అది ఈ సినిమా ద్వారా నెర‌వేరింది.

నా అదృష్టం

అప్పట్లో లేడీస్ టైల‌ర్ సినిమాకు ఇళ‌య‌రాజా గారు సంగీతం అందించారు.. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాకు నేను సంగీతం అందించడం నా అదృష్టం. ఖ‌చ్చితంగా మా గురువు గారి పేరు నిల‌బెట్టేలాంటి సంగీతమే సినిమాకు అందించాను.

చాలా ఫ్రీడమ్ ఇచ్చారు

ఈ సినిమా విషయం లో వంశీ గారు మధుర శ్రీధర్ గారు చాలా ఫ్రీడ‌మ్ ఇచ్చారు. ఇప్ప‌టివ‌ర‌కు ఏ విష‌యంలో కాంప్ర‌మైజ్ అవ్వ‌మ‌ని కానీ,తొంద‌రపెట్టింది కానీ లేదు. న‌న్ను తామ‌ర‌పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటే ఎలా ఉంటానో అలా చూసుకున్నారు. మధుర ఆడియో సంస్థ ఓనర్ గా తను మంచి సంగీతాన్ని ఎప్పుడూ ఆదరిస్తూనేవుంటారు.

నేను బెస్ట్ అని నా ఫీలింగ్

వంశీ గారితో నా మీటింగ్ చాలా గొప్ప‌గా జ‌రిగింది. వంశీ గారి సినిమాల్లో పాట‌లు ఎలా ఉంటాయో, ఆయ‌న టేస్ట్ఏంటో నాకు తెలుసు కాబ‌ట్టి, త్వ‌ర‌గానే ప‌ని కూడా పూర్తి చేయ‌గ‌లిగా. ఎవ‌రికి త‌గ్గ‌ట్టు వారికి పాట‌లు ఇవ్వ‌డంలో నేను బెస్ట్ అని నా ఫీలింగ్

నా పాట‌లు ఎప్పుడూ ఫ్రెష్ గా ఉంటాయి

చాలా ఫ్రీ మైండ్ తో ఈ సినిమాకు ట్యూన్స్ చేశా. ఎప్పుడైనా ఒక ట్యూన్ చేసేటప్పుడు మ‌న‌సంతా దానిమీద పెడితేనే, ది బెస్ట్ అవుట్ పుట్ మ‌న‌కు వ‌స్తుంది, అందుకే నా పాట‌లు ఎప్పుడూ ఫ్రెష్ గా ఉంటాయి.

ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకుని చేశా

ఈ సినిమాలో మొత్తం మెలోడీ సాంగ్సే. ఈ ఆల్బ‌మ్ ను ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకుని చేశా. ఒక్కో సాంగ్ కు ఒక్కో ప్ర‌త్యేకత ఉండేలా ఈ ఆల్బ‌మ్ రెడీ చేశా.

ఆ సినిమాకంటే ఎక్కువే

ఆ సినిమా కంటే ఈ సినిమాలోనే ఎక్కువ ఫ‌న్ , ఎంట‌ర్ టైన్ మెంట్ ఉంటుంది. సినిమా త‌ప్ప‌కుండా అందరికి బాగా న‌చ్చుతుంది. రేపు సినిమా చూశాక ప్రేక్ష‌కులే ఆ విష‌యం చెప్తారు. అయినా ఆ సినిమాకు, ఈ సినిమాకు అస‌లు సంబంధం ఉండ‌దు. కేవ‌లం లేడీస్ టైల‌ర్ కొడుకు ఈ ఫ్యాష‌న్ డిజైన‌ర్ అంతే.

ప‌డిన శ్ర‌మంతా మ‌ర్చిపోయా

ఈ సినిమాలోని కనులేమిటో అనే పాట నాకు చాలా ఇష్టం. ఈ పాట‌ను ఎంతో కుస్తీలు ప‌డి మ‌రీ చేశా. చివ‌ర్లో ఈ సాంగ్ ఫైనల్ వెర్ష‌న్ విన్నాక‌, పాట కోసం ప‌డిన శ్ర‌మంతా మ‌ర్చిపోయా. ఈ పాట‌లో ఇప్ప‌టి ట్రెండ్ కు స‌రిపోయే రిథ‌మ్ఉంటుంది.

20 ఏళ్ళు ఎంతో సంతోషంగా గడిపిచింది..

నేను ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి, 20 ఏళ్లు అవుతుంది. ఈ 20 యేళ్ల జీవితం వండ‌ర్‌ఫుల్ గా గడిపాను.

 

ఆయన్నే ఫాలో అయ్యాను

వంశీ గారి సినిమాలో పాటలంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది..ఈ సినిమా విష‌యంలో ఆయన అభిరుచినే ఫాలో అయ్యాను. పెద్ద పెద్ద హీరోల విష‌యంలోనే హీరోల‌కు సంబంధించిన‌ట్లు వారికి స‌రిపోయే సంగీతం ఇస్తాను.

వ‌య‌సు తో ఏం ప‌న్లేదు

ఎప్పటి కప్పుడు అప్ డేట్ చేసుకోవాలి. అయినా మ్యూజిక్ కు వ‌య‌సు తో ఏం ప‌న్లేదు. ఆ విష‌యానికొస్తే, నేను ఏ పాట‌నైనా మెలోడీ చేయ‌గ‌ల‌ను.

పాట‌లు బాలేక‌పోయినా మ్యూజిక‌ల్ హిట్టే

అప్పుడు సినిమాలో పాట‌లు, నేప‌థ్య సంగీతం బాగుంటేనే అది మ్యూజిక‌ల్ హిట్.ఇప్పుడు మాత్రం సినిమా హిట్ అయి, పాట‌లు బాలేక‌పోయినా మ్యూజిక‌ల్ హిట్టే.

ప్రస్తుతం ఆ మూడు సినిమాలు

ప్రస్తుతం మోహ‌న్ కృష్ణ‌ ఇంద్ర‌గంటి దర్శ‌క‌త్వంలో వ‌స్తున్న అమీ తుమీ. నితిన్-హ‌ను రాఘ‌వపూడి కాంబినేష‌న్ లో వ‌స్తున్న లై అనే సినిమాతో పాటు శమంత‌క‌మ‌ణి అనే మ‌రో సినిమా కు సంగీతం అందిస్తున్నాను.