టీజర్ తో మెస్మరైజ్ చేస్తానంటున్న నాని

Wednesday,May 24,2017 - 03:05 by Z_CLU

ప్రెజెంట్ ‘నిన్ను కోరి’ అనే సినిమాతో సెట్స్ పై ఉన్న నేచురల్ స్టార్ నాని ఈ సినిమాకు సంబంధించిన ఓ సాంగ్ టీజర్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు.  శివ నిర్వాణ దర్శకత్వంలో డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలోని ఓ సాంగ్ నాని కి మోస్ట్ ఫెవరెట్ గా మారిపోయిందట.. అందుకే ఆ సాంగ్ తోనే సినిమా ప్రమోషన్ ను మొదలపెట్టాలని డిసైడ్ అయిపోయాడట..

గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ‘అడిగా అడిగా’ అంటూ సాగే ఈ సాంగ్ విన్న వెంటనే నా మోస్ట్ ఫెవరెట్ సాంగ్ అయిపొయింది. కచ్చితంగా ఈ సాంగ్ నా కెరీర్ లోనే ది బెస్ట్ సాంగ్ గా నిలిచిపోతుందనడం లో   ఎటువంటి సందేహం లేదు.. ఈ నెల 27 న ఈ ప్రమోషనల్ సాంగ్ తోనే సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నాం. లవ్ లో పడబోయే వాళ్ళకి, ఆల్రెడీ లవ్ లో ఉన్నవాళ్ళకి , లవ్ లో పడి బయట పడిన వాళ్లందరికీ ఈ సాంగ్ కొన్ని రోజుల పాటు లూప్ లో ఉండబోతుంది..నాకు ఈ సాంగ్ మీదా ఆ నమ్మకం ఉంది. ఈ సాంగ్ కి సంబంధించి 20 సెకన్స్ టీజర్ ఒకటి రెడీ చేశాం అది ఈరోజు సాయంత్ర 6 గంటలకు రిలీజ్ చేయబోతున్నాం అంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు నాని. మరి నాని కి మోస్ట్ ఫెవరెట్ సాంగ్ గా మారిపోయిన ఈ సాంగ్ వినాలంటే ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే…

#NinnuKori#LetsWelcomeLife

Posted by Actor Nani on Wednesday, 24 May 2017