నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పబోతున్న శ్రీ దేవి

Wednesday,May 24,2017 - 05:22 by Z_CLU

శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్‌ దర్శకత్వంలో మ్యాడ్‌ ఫిలింస్‌, థర్డ్‌ ఐ పిక్చర్స్‌ బ్యానర్స్ పై తెరక్కెడుతున్న మూవీ ‘మామ్‌’. తెలుగు, తమిళ్‌, మలయాళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా కోసం నాలుగు భాషల్లో తనే డబ్బింగ్ చెప్పడానికి రెడీ అవుతుందట శ్రీదేవి.

ఇప్పటికే తెలుగు,తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన శ్రేదేవి కి ఈ మూడు భాషలో డబ్బింగ్ చెప్పడం పెద్దగా ఇబ్బంది కాకపోయినా మలయాళం కి సంబంధించి మాత్రం డబ్బింగ్ కోసమే ప్రత్యేకంగా ఆ భాష నేర్చుకొని మరీ డబ్బింగ్ చెప్పబోతుందట . శ్రీదేవి భర్త బోణి కపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాను జూలై 7 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు..