మహేష్ అప్ కమింగ్ మూవీస్

Friday,July 21,2017 - 10:06 by Z_CLU

ప్రెజెంట్ మురుగదాస్ దర్శకత్వంలో ‘స్పైడర్’ సినిమా చేస్తున్న సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో పడ్డాడు. ప్రెజెంట్ కొరటాల శివతో మరో సినిమాను సెట్స్ పై పెట్టిన మహేష్ ఈ సినిమా తర్వాత వంశీ పైడి పల్లితో పాటు త్రివిక్రమ్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.


‘శ్రీమంతుడు’ తో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందించిన కొరటాల శివతో ‘భరత్ అనే నేను’ సినిమా చేస్తున్న మహేష్ రీసెంట్ గా ఈ సినిమాను సెట్స్ పై పెట్టేశాడు. పొలిటికల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మహేష్ రాజకీయనాయకుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాను దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా డి.వి.వి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నాడు.


కొరటాల శివతో చేస్తున్న సినిమాను ఓ కొలిక్కి తీసుకురాగానే వంశీ పైడిపల్లి తో తెరకెక్కే సినిమాను సెట్స్ పై పెట్టాలని చూస్తున్నాడు మహేష్. ఇటీవలే మహేష్ బర్త్ డే సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఈ సినిమాకు సంబంధించి ప్రెజెంట్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడట వంశీ. ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నఈ సినిమాను అశ్వనీదత్, దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు.


వంశీ పైడిపల్లి తో సినిమా పూర్తవ్వగానే త్రివిక్రమ్ తో మూడో సినిమా ప్లాన్ చేస్తున్నాడు మహేష్. ఇప్పటికే వీరిద్దరూ కాంబినేషన్ లో మూడో సినిమా త్వరలోనే ఉండనుందని త్వరలోనే మా కాంబినేషన్ లో సినిమా స్టార్ట్ అవుతుందని ఇద్దరూ చాలా ఇంటర్వ్యూ లో అనౌన్స్ చేశారు. సో వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్ తో సినిమాలు పూర్తయ్యాక మిగతా దర్శకులతో సినిమాలు ప్లాన్ చేస్తాడన్నమాట మహేష్.