రేపే మహేష్ బాబు కొత్త సినిమా ఓపెనింగ్

Sunday,August 13,2017 - 03:01 by Z_CLU

ఇప్పటికే ఓ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు మహేష్. ఇంతలోనే మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. అది కూడా తన కెరీర్ లో కీలకమైన సినిమా కావడం విశేషం. రేపు మహేష్ బాబు 25వ సినిమా ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్ రాజు, అశ్వనీదత్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు ఈ సినిమాని.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ సినిమా చేస్తున్నాడు మహేష్. ఈ సినిమా షూటింగ్ కోసం ఇప్పటికే లక్నో చేరుకున్నాడు మహేష్. ఈనెల 22 వరకు అక్కడే షూటింగ్ ఉంటుంది. సో.. కొత్త సినిమా ప్రారంభోత్సవానికి మహేష్ హాజరుకాడు. మహేష్ తరఫున అతడి భార్య నమ్రత ఓపెనింగ్ కు హాజరవుతారు.

మహేష్ చేతిలో కొరటాల సినిమాతో పాటు స్పైడర్ కూడా ఉంది. 22తో కొరటాల సినిమా షెడ్యూల్ కంప్లీట్ అయిపోతే… ఆ వెంటనే స్పైడర్ కు సంబంధించి మిగిలిన ఒక్క పాట షూటింగ్ ను కంప్లీట్ చేయబోతున్నాడు మహేష్. దీనికోసం యూనిట్ అంతా రొమేనియా వెళ్తుంది. కొరటాల శివ సినిమా ఓ కొలిక్కి వచ్చిన తర్వాత, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడు మహేష్.