అఖిల్ సినిమాకు టైటిల్ అదేనా ?

Sunday,August 13,2017 - 01:20 by Z_CLU

అక్కినేని యంగ్ హీరో అఖిల్ విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ అయిందనే వార్త వినిపిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మొన్నటి వరకూ జున్ను అనే టైటిల్ ప్రచారంలో ఉండగా… తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ సినిమా కోసం ‘రంగుల రాట్నం’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారని టాక్.

ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఈ టైటిల్ నే ఖరారు చేస్తారా.. లేదా ఈ బ్యానర్లో మరో సినిమాకు ఈ టైటిల్ పెడతారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ 22 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్..