కొత్త సినిమా లాంచ్ చేసిన వరుణ్ తేజ్

Monday,June 18,2018 - 02:54 by Z_CLU

ఈ రోజు వరుణ్ తేజ్ చేతుల మీదుగా కొత్త సినిమా లాంచ్ అయింది. శ్రియ శరణ్, నిహారిక కొణిదెల లీడ్ రోల్స్ ప్లే చేయనున్న ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ కార్యక్రమానికి వరుణ్ తేజ్ తో పాటు దర్శకుడు క్రిష్ కూడా అటెండ్ అయ్యాడు.

ఈ సినిమా ఎగ్జాక్ట్ స్టోరీలైన్ అయితే బయటికి రాలేదు కానీ, శ్రియ తో పాటు, నిహారిక కొణిదెల డిఫెరెంట్ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమా ఫీమేల్ ఓరియంటెడ్ ఎంటర్ టైనర్ గా తెలుస్తుంది. శ్రియ పెళ్ళి తరవాత సంతకం చేసిన ఫస్ట్ మూవీ ఇదే కావడం విశేషం.

 

 

గతంలో ‘కంచె’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’, ‘గౌతమీ పుత్ర శాతకర్ణీ’ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన జ్ఞానశేఖర్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. సుజన ఈ సినిమాకి డైరెక్టర్. ఇళయరాజా ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేయనున్నాడు.