అల్లు శిరీష్ ABCD – రివీల్ అయిన కీ పాయింట్

Monday,June 18,2018 - 12:18 by Z_CLU

ఈ రోజే సెట్స్ పైకి వచ్చింది అల్లు శిరీష్ ABCD. రీసెంట్ గా ‘ఒక్కక్షణం’ సినిమాతో ఇంప్రెస్ చేసిన ఈ మెగా హీరో మరో హిలేరియస్ ఎంటర్ టైనర్ తో రెడీ అవుతున్నాడు. అయితే మళయాళ బ్లాక్ బస్టర్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు శిరీష్, అసలు రెస్పాన్సిబిలిటీస్ అంటేనే నచ్చని యంగ్ స్టర్ లా కనిపించనున్నాడు.

హీరోని ఎలా దారి పెట్టుకొవాలో తెలీని పేరెంట్స్, ఇండియా కన్నా గొప్ప యూనివర్సిటీ లేదనే ఫీలింగ్ తో  కేవలం నెలకు 5000 రూపాయల పాకెట్ మనీతో ఇండియాకి పంపిస్తారు. అప్పుడు హీరో ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు..? ఏం నేర్చుకున్నాడు అనేదే ఈ సినిమాలో కీ పాయింట్.

 

జూన్, జూలై లో ఇండియాలో, ఆ తరవాత ఆగష్టులో U.S. లోని ఎగ్జోటిక్ లొకేషన్ లలో షూటింగ్ ప్లాన్ చేసుకున్న ఫిల్మ్ మేకర్స్, ఈ రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్నారు. ఈ సినిమాలో అల్లు శిరీష్ సరసన రుష్కార్ హీరోయిన్ గా నటిస్తుంది. సంజీవ్ రెడ్డి ఈ సినిమాకి డైరెక్టర్. యష్ రంగినేని, మధుర శ్రీధర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.