మహేష్ బాబు స్పైడర్ ట్రైలర్ రివ్యూ

Friday,September 15,2017 - 12:45 by Z_CLU

మహేష్ బాబు మోస్ట్ అవేటెడ్ మూవీ ‘స్పైడర్’ ట్రైలర్ రిలీజయింది. సెప్టెంబర్ 27 న రిలీజ్ కానున్న ఈ సినిమా ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. దానికితోడు సినిమాలో హైలెట్ కాబోయే ఎలిమెంట్స్ తో రాత్రి రిలీజైన ట్రేలర్ ఫ్యాన్స్ లో మరింత హీట్ ని జనరేట్ చేస్తోంది.

ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా కనిపించనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్రడక్షన్ తో బిగిన్ అయ్యే ఈ ట్రేలర్ లో అటు యాక్షన్ తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్, రొమాన్స్ కూడా మిక్స్ చేశారు. సో.. సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ అనే విషయం ట్రయిలర్ తోనే అర్థమైపోయింది. “ఫోన్ లో ఎవరైనాా బెదిరించినా, ఏడ్చినా, హెల్ప్ అని అన్నా నా సాఫ్ట్ వేర్ ఆన్ అయి స్క్రీన్ బ్లిక్ అవుతుంది.” అనే డైలాగ్ తో సినిమా ప్లాట్ ఏంటనే విషయాన్ని లైట్ గా రివీల్ చేశారు మేకర్స్.

మహేష్ ఎప్పీయరెన్స్, లుక్స్, యాక్టింగ్ టోటల్ ట్రయిలర్ కు హైలెట్ గా నిలవగా.. విలన్ గా నటించిన ఎస్ జే సూర్య నటన, హీరోయిన్ రకుల్ ఎక్స్ ప్రెషన్స్ ట్రయిలర్ కు ఓ లుక్ తీసుకొచ్చాయి. వీటికి గ్రాఫిక్స్ ఎలిమెంట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా యాడ్ అవ్వడంతో ఇనిస్టెంట్ గా హిట్ అయింది స్పైడర్ ట్రయిలర్.