స్పైడర్ నుంచి మరో సర్ ప్రైజ్

Friday,September 15,2017 - 12:22 by Z_CLU

మరికొన్ని గంటల్లో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరగనుండగా.. స్పైడర్ నుంచి మరో సర్ ప్రైజ్ వచ్చింది. ఇప్పటికే స్పైడర్ థియేట్రికల్ ట్రయిలర్ విడుదల కాగా.. ఆ క్రేజ్ ను మరింత పెంచుతూ ఆశ్చర్యకరంగా మరో సాంగ్ విడుదల చేసింది యూనిట్. అవును.. జ్యూక్ బాక్స్ తో సంబంధం లేకుండా స్పైడర్ నుంచి మరో సింగిల్ వచ్చింది. ‘అక్కడ ఉన్నవాడు’ అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.

రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఆ సాంగ్ ను గీతా మాధురి ఆలపించారు. మాస్ బీట్ తో పాటు ఫోక్ స్టయిల్ మిక్స్ చేసి ఈ సింగిల్ కంపోజ్ చేశాడు మ్యూజిక్ డైరక్టర్ హరీష్ జైరాజ్. తాజా పాటతో స్పైడర్ లో సాంగ్స్ 5 అయ్యాయి. ఇవి కాకుండా స్పైడర్ థీమ్ సాంగ్ ఎలాగూ ఉంది.