యూరోప్ లో మహేష్ బాబు స్పైడర్

Thursday,July 27,2017 - 03:25 by Z_CLU

స్పైడర్ మ్యాగ్జిమం షూటింగ్ కంప్లీట్ అయింది ఒక్క సాంగ్ తప్ప. ఓ వైపు షూటింగ్ ప్రాసెస్ లో ఉండగానే పోస్ట్ ప్రొడక్షన్ బిగిన్ చేసేసిన సినిమా యూనిట్, ఈ సినిమాని దసరా పండక్కి థియేటర్స్ లోకి తీసుకువస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ లోపు లాస్ట్ సాంగ్ షూటింగ్ షెడ్యూల్ చేసుకున్న సినిమా యూనిట్ ఆగష్టు 2 నుండి 8 వరకు షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంది. యూరోప్ లోని రొమేనియాలో ఈ సాంగ్ ని తెరకెక్కించబోతున్నారు.

ఇప్పటికే ఒక టీజర్ తో సినిమాపై  ఎక్స్ పెక్టేషన్స్ ని రేజ్ చేసిన సినిమా యూనిట్, సెకండ్ టీజర్ ని మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగష్టు 9 రిలీజ్ చేయనుంది సినిమా యూనిట్. A.R. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు కోలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి హారిస్ జయరాజ్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.