ఆగస్ట్ 12 నుంచి బన్నీ కొత్త సినిమా షూటింగ్

Thursday,July 27,2017 - 04:11 by Z_CLU

సెట్స్ పైకి రాకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’. రీసెంట్ గా DJ తో బ్లాక్ బస్టర్  ని బ్యాగ్ లో వేసుకున్న బన్ని, ఇప్పుడు ‘నా పేరు సూర్య’ సినిమాలో మేకోవర్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. అయితే నిన్నటి వరకు ఈ సినిమా కోసం స్పెషల్ ఫిట్ నెస్ ట్రేనింగ్ తీసుకోవాలనుకుంటున్న బన్ని U.S. కి వెళ్తున్నాడని, కాబట్టి సినిమా సెట్స్ పైకి వచ్చే చాన్సెస్ ఇప్పట్లో లేవని మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవాలని స్టేట్ మెంట్ ఇచ్చింది సినిమా యూనిట్.

ఈ సినిమాలో లుక్ కోసం బన్ని స్పెషల్ ట్రేనింగ్ తీసుకోవడం కరెక్టే కాకపోతే బన్ని U.S. కి వెళ్ళడం లేదు, అక్కడి నుండే స్పెషల్ ట్రేనర్ ని ఇండియాకి రప్పిస్తున్నాడు. కాబట్టి ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ఆగష్టు 12 న యధావిధిగా సెట్స్ పైకి వచ్చేస్తుందని, ఇందులో ఎలాంటి డిలేస్ ఉండవని కన్ఫం చేశారు ఫిల్మ్ మేకర్స్.