మహేష్ బాబు కొరటాల మూవీ అప్ డేట్స్

Tuesday,June 20,2017 - 05:08 by Z_CLU

మహేష్ బాబు కొరటాల సినిమా సెకండ్ షెడ్యూల్ రేపటి నుండి బిగిన్ కానుంది. ఫస్ట్ షెడ్యూల్ లో మహేష్ బాబు చైల్డ్ హుడ్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించిన సినిమా యూనిట్, రేపటి నుండి సూపర్ స్టార్ తో రెగ్యులర్ షూటింగ్ బిగిన్ చేయనుంది. ఈ సినిమాలో మహేష్ బాబు పొలిటికల్ లీడర్ లా కనిపించనున్నాడు.

అల్టిమేట్ పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఇప్పటికే హైదరాబాద్ లో పెద్ద అసెంబ్లీ సెట్ ని ప్లాన్ చేసుకుంది సినిమా యూనిట్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరి 11 న రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది.