మహేష్ ఇంటర్వ్యూ

Monday,September 25,2017 - 07:33 by Z_CLU

మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘స్పైడర్’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా రేపు థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సందర్భంగా మహేష్ మీడియాతో ముచ్చటించాడు.. ఆ విశేషాలు సూపర్ స్టార్ మాటల్లోనే …

 

టెన్షన్ ఉంది

మరికొన్ని గంటల్లో స్పైడర్ రిలీజ్ అవుతుంది.. దాదాపు 1000 మంది ఎంతో కష్టపడి పనిచేశాం. ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఇవ్వడం కోసం మేం పడ్డ శ్రమను వారు ఏ విధంగా రిసీవ్ చేసుకొంటారోననే టెన్షన్ లో ఉన్నాను.

 

 

పదేళ్లుగా అనుకుంటున్నాం..ఇప్పటికి కుదిరింది

దాదాపు పదేళ్లుగా మురుగదాస్ గారు నేను కలిసి ఓ సినిమా చేయాలని ట్రై చేస్తూనే ఉన్నాం. ఓ సారి నా డేట్స్ కుదరకపోవడం, మరో సారి ఆయన డేట్స్ కుదరకపోవడం.. అలా జరుగుతూ ఫైనల్ గా ఇప్పటికి ‘స్పైడర్’ తో మా కాంబినేషన్ కుదిరింది. మా కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా నాకు మొదటి బై లింగ్వెల్ సినిమా అవ్వడం చాలా సంతోషంగా ఉంది.

 

 

దేనికదే సెపరేటు

నిజానికి ఈ సినిమా బై లింగ్వెల్ అనగానే రెండు లాంగ్వేజెస్ లో ఆడియన్స్ ఎంటర్ టైన్ చేయాలని బాగా ఆలోచించాం. కాని మురుగదాస్ ప్రాపర్ గా ప్లాన్ చేసి రెండు లాంగ్వేజ్ ఆడియన్స్ కు నచ్చేలా సినిమాను తెరకెక్కించారు. దేనికదే సెపరేట్ లా అనిపిస్తుంది. తమిళ్ కి వచ్చేసరికి అక్కడ కొంతమంది తమిళ్ ఆర్టిస్టులుంటారు ..తెలుగు కి వచ్చేసరికి మన ఆర్టిస్టులుంటారు.

కొత్త అనుభూతి

ఫస్ట్ టైం ఈ సినిమాలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసే స్పై ఏజెంట్ గా నటించా. నటుడిగా ఒక కొత్త అనుభూతి కలిగింది. ఇలాంటి రోల్ చేసేటప్పుడు డైరెక్టర్ మీదే మెయిన్ ఫోకస్ పెట్టాలి.. ఆయన చెప్పింది చెప్పినట్టు చేసాననే ఫీల్ అవుతున్నాను. కచ్చితంగా సినిమా చూసాక అందరికీ ఈ రోల్ బాగా కనెక్ట్ అవుతుంది.

 

 

ఇంతేనా అనిపించింది

ఈ సినిమా పూర్తవ్వగానే కొరటాల శివతో చేస్తున్న సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాను.. డైలాగ్స్ ఇచ్చారు.. చెప్పేసా.. అయిపోయింది అన్నారు.. ఒక్కసారిగా ఇంతేనా..? అనిపించేసింది. ఎందుకంటే స్పైడర్ కి ఒక్కో డైలాగ్ రెండు సార్లు చెప్పాలి.. ప్రతీ సీన్ లో 2 సార్లు నటించాలి. అది కాస్త కష్టంగా అనిపించింది. ఇంకోసారి బైలింగువల్ అంటే బాగా ఆలోచించాలి.. కాని ఫైనల్ గా సినిమా అవుట్ పుట్ చూసి అదంతా మర్చిపోయా.

 

 

అలా కుదిరేసింది

చెన్నై లోనే పుట్టి పెరిగాను కాబట్టి తమిళ్ వచ్చు.. సెట్ లో నేను తమిళ్ మాట్లడటం విని మురుగదాస్ గారు తమిళ్ లో కూడా మీరే డబ్బింగ్ చెప్తే బాగుంటుంది అని నాకు కాన్ఫిడెంట్ గా చెప్పారు. నేను ఓకే అనేసా.. కానీ ఆయన తమిళ్ లో నేను చెప్పిన ప్రతీ డైలాగ్ కి ప్రత్యేక శ్రద్ధ వహించి ఎక్కడైనా చిన్న తప్పు వస్తే మళ్ళీ చెప్పించుకున్నారు.

 

 

నా కరియర్ లోనే భారీ బడ్జెట్ సినిమా

“స్పైడర్” స్టోరీకి బడ్జెట్ స్కోప్ ఎక్కువన్న విషయం కథ ఫైనల్ చేసినప్పట్నుంచే మా మైండ్ లో ఉంది. అందువల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిందని కానీ.. లేట్ అవుతుందని కానీ ఎప్పుడూ కంగారు పడలేదు. నన్ను, మురుగదాస్ ని, కథని నమ్మి నిర్మాతలు బాగా ఖర్చు పెట్టారు. నిజానికి నా కరియర్ లోనే ఇంత భారీ బడ్జెట్ సినిమా రాలేదు. ఈ సందర్భంగా మా నిర్మాతలకి థాంక్స్ చెప్పుకుంటున్నా.. ఈ సినిమాతో వాళ్ళు లాభ పడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

 

 

రెండు నెలల తర్వాత ఆ పేరు చెప్పారు 

మురుగదాస్ సినిమాలో విలన్ రోల్ గురించి చెప్పగానే ఎగ్జైట్ అయ్యాను. సినిమాలో ఆ రోల్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ రోల్ ఎవరు చేస్తే బాగుంటుందా.. అని వెయిట్ చేశాం. రెండు నెలల తర్వాత ఆయన ఎస్.జె.సూర్య ఈ రోల్ చేస్తున్నారని చెప్పగానే ఎగ్జైట్ మెంట్ మరింత ఎక్కువైంది. సూర్య నాకు ఇంతకు ముందే పరిచయం ఉండటం, ఇద్దరం కలిసి పనిచేయడంతో నటులుగా మా కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. చాలా బ్రిలియంట్ గా పెర్ఫార్మ్ చేశారు. మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ థియేటర్స్ లో ఆడియన్స్ ను బాగా ఎంటర్టైన్ చేస్తాయి.

 

 

సినిమాలో స్పైడర్ ఉండదు..

హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కోసం రిలీజ్ చేసిన టీజర్ లో రోబో స్పైడర్ ను చూసి.. అది సినిమాలో కూడా ఉంటుందేమోనని చాలామంది అనుకొంటున్నారు. అది కేవలం హీరో క్యారెక్టరైజేషన్ జనాలకు అర్ధమవ్వడం కోసం డిజైన్ చేశాం. సినిమాలో ఆ రోబో స్పైడర్ ఎక్కడా ఉండదు.

 

మురుగదాస్ మెసేజ్ పక్కా

మురుగదాస్ గారు ఇప్పటివరకూ తీసిన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సోషల్ మెసేజ్ కచ్చితంగా ఉంటుంది. అలాగే “స్పైడర్”లోనూ డైరెక్ట్ గా నీతులు, సందేశాలు ఇవ్వకపోయినా.. ఒక అండర్ మెసేజ్ అనేది మాత్రం కచ్చితంగా ఉంటుంది. అదే మురుగదాస్ గారి మార్క్. అది ఆయన అస్సలు మిస్ అవ్వడు.

 

ఆ 27 రోజుల్ని మర్చిపోలేను..

అహ్మదాబాద్ లో దాదాపు 27 రోజులు షూట్ చేశాం. రోజూ నైట్ షూట్సే. అసలు అక్కడ ఎన్ని రోజులున్నాం అనేది మా ప్రొడక్షన్ టీం చెప్పేవారకూ మాకెవరికీ అర్ధం కాలేదు. పైగా.. షూట్ మొత్తం రాత్రి 1 నుండి తెల్లవారుజాము 5 లోపు జరిగేది. అందువల్ల అహ్మదాబాద్ లో మేము సూర్యుడ్ని చూసింది చాలా తక్కువ.

ఈ సినిమాతో నా కోరిక నెరవేరింది

నా చిన్నప్పుడు “దళపతి, రోజా” సినిమాలు చూసినప్పట్నుంచి సంతోష్ శివన్ తో వర్క్ చేయాలన్నది నా కోరిక. ఆయన్ని నేను చాలా సినిమాల కోసం ఫోన్ చేసి మరీ అడిగాను. ఆయన నిర్మొహమాటంగా “తెలుగు డైరెక్టర్స్ తో నేను వర్క్ చేయలేను, వాళ్ళ సినిమా టేకింగ్ స్టైల్ వేరు.. నా సినిమాటోగ్రఫీ స్టైల్ వేరు, రెండూ సింక్ అవ్వవు” అని చెప్పేశారు. ఆఖరికి మురుగదాస్ గారి సినిమాతో నా కోరిక నెరవేరడం చాలా ఆనందంగా ఉంది.

 

 

బాహుబలి వల్లే ఆ క్రేజ్

“బాహుబలి” రిలీజ్ అయ్యాక తెలుగు సినిమాల క్రేజ్ భారీగా పెరిగింది. ఇప్పుడు సౌత్ నుంచి ఒక సినిమా వస్తుందంటే.. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే “స్పైడర్” హిందీ డబ్బింగ్ రైట్స్ కు విపరీతమైన డిమాండ్ వచ్చింది. అయితే.. టైమ్ కుదరకపోవడంతో స్పైడర్ ను హిందీలో రిలీజ్ చేయలేకపోతున్నాం.

 

చాలా ఈజీగా మేనేజ్ చేసేసింది

తెలుగు-తమిళం చాలా స్పష్టంగా అర్ధం చేసుకొని మాట్లాడగల నేనే రెండు భాషల్లో నటించడానికి కాస్త ఇబ్బందిపడ్డాను. కానీ.. రకుల్ మాత్రం చాలా ఈజీగా రెండు భాషలను మేనేజ్ చేస్తూ నటించేసింది. సినిమాలో రకుల్ చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తుంది.

 

ఆయన మ్యూజిక్ స్లో పాయిజన్

హారిస్ జైరాజ్ మ్యూజిక్ స్లో పాయిజన్ లాంటిది. వెంటనే ఎక్కదు కానీ.. వినగా వినగా మ్యూజిక్ కి ఎడిక్ట్ అయిపోతారు. ప్రస్తుతం మా అమ్మాయి సితార “స్పైడర్” సాంగ్స్ ను విపరీతంగా ఎంజాయ్ చేస్తుంది. ఆయన సినిమాకి చేసిన “బ్యాగ్రౌండ్ స్కోర్” విన్నాక.. ఒక సినిమాకి ఇలా కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చేయొచ్చా అనిపించింది. అంత అద్భుతమైన ఔట్ పుట్ ఇచ్చాడాయన. మళ్ళీ మళ్ళీ ఆయనతో పనిచేయాలనుంది.

 

అదొక్కటే తేడా

తెలుగు/తమిళ సెన్సార్ రిపోర్ట్స్ చూసినవాళ్ళంతా రెంటికీ ఒక నిమిషం తేడా ఉంది ఏంటది అని ఆడుతున్నారు. తమిళ నిర్మాణ సంస్థ “లైకా ప్రొడక్షన్స్” లోగో ఒక్కటే తేడా.. ఆ లోగో ఒక 30 సెకన్లపాటు ఉంటుంది. అందువల్ల జనాలకి డిఫరెన్స్ కనిపిస్తుందే తప్ప వేరే తేడా ఏమీ లేదు.

 

త్వరలోనే రాజమౌళి తో సినిమా

రాజమౌళిగారితో ఓ సినిమా కమిట్ మెంట్ ఉంది. అయితే.. ఆయన-నేను బిజీగా ఉండడం వల్ల అది మెటీరియలైజ్ అవ్వలేదు.  త్వరలోనే కచ్చితంగా మా కాంబినేషన్ లో సినిమా ఉంటుంది..