కుంభకోణం పని పూర్తిచేసిన బాలయ్య

Monday,September 25,2017 - 05:30 by Z_CLU

ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తన 102వ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా కుంభకోణంలో జరుగుతోంది. ఇవాళ్టితో ఈ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. దాదాపు 30 రోజుల పాటు జరిగిన ఈ భారీ షెడ్యూల్ లో బాలకృష్ణపై ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ తో పాటు ఓ సాంగ్ కూడా పిక్చరైజ్ చేశారు. కథ ప్రకారం.. ఆలయ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎపిసోడ్ ఇది.

కుంభకోణం షెడ్యూల్ లో హీరోయిన్ నయనతార మినహా కీలకమైన యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు. బాల‌కృష్ణ‌తో పాటు న‌టాషా, ప్ర‌కాష్‌రాజ్‌, బ్ర‌హ్మానందం, ముర‌ళీ మోహ‌న్‌, జేపీ, ఎల్బీ శ్రీ‌రామ్‌ పాల్గొన్నారు. దాదాపు 2వేల మంది పురోహితులు, ఫైటర్లు, జూనియ‌ర్ ఆర్టిస్టుల తో ఫైట్ మాస్ట‌ర్లు రామ్ ల‌క్ష్మ‌ణ్‌, అరివి మ‌ణి ఈ పోరాట ఘ‌ట్టాన్ని తెర‌కెక్కించారు.

బాలయ్య-కేఎస్ రవికుమార్ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. సీకే ఎఁటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు.