‘మేజర్ అజయ్ కృష్ణ’ గా మహేష్ బాబు

Wednesday,July 10,2019 - 03:54 by Z_CLU

ఫస్ట్ షెడ్యూల్ ని కాశ్మీర్ లోనే ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అక్కడ ఆర్మీకి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అయితే పనిలో పనిగా సినిమాలో మహేష్ బాబు ప్లే చేస్తున్న క్యారెక్టర్ పేరు రివీల్ చేశారు మేకర్స్. ‘సరిలేరునీకెవ్వరు’ లో మేజర్ అజయ్ కృష్ణ గా కనిపించబోతున్నాడు మహేష్ బాబు.

అటు యాక్షన్ తో పాటు కావాల్సినంత కామెడీ ఎలిమెంట్స్ తో సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ షెడ్యూల్ లో సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించే పనిలో ఉంది యూనిట్. రాజేంద్రప్రసాద్ కూడా ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా నటిస్తున్నారు.

రష్మిక మండన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. సీనియర్ నటి విజయశాంతి సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. D.S.P. మ్యూజిక్ కంపోజర్. AK ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీ వెంకశ్వర క్రియేషన్స్, GMB ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. 2020 లో సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది ఈ సినిమా.