రామ్ పై ఇస్మార్ట్ శంకర్ ఎఫెక్ట్..?

Wednesday,July 10,2019 - 02:03 by Z_CLU

ఇస్మార్ట్ శంకర్’ ఇంపాక్ట్ రామ్ కరియర్ పై పడనుందా..? నిన్నా మొన్నటి వరకు సాఫ్ట్ క్యారెక్టర్స్ తో ఆడియెన్స్ ని ఇంప్రెస్ చేసిన రామ్ ఒక్కసారిగా మాస్ అవతారమెత్తాడు… ఈ ఇంపాక్ట్ రామ్ ఫ్యూచర్ లో సెలెక్ట్ చేసుకోబోయే సినిమాలపై కూడా పడనుందా..?

వరసగా లవర్ బాయ్ సినిమాలు చేసేసరికి రామ్ నుండి డిఫెరెంట్ రోల్స్ ఎక్స్ పెక్ట్ చేశారు ఆడియెన్స్. సరిగ్గా అదే టైమ్ లో పూరి ‘ఇస్మార్ట్ శంకర్’ కథ చెప్పడం… రామ్ కి కలిసొచ్చింది. ఆడియెన్స్ కనీసం కలలో కూడా ఊహించని  లుక్స్ తో మాస్ మీరో అనిపించుకుంటున్నాడు రామ్ ‘ఇస్మార్ట్ శంకర్’ లో…

రామ్ సినిమాలంటే క్యూట్ లవ్ స్టోరీ.. అక్కడక్కడా 2 ఫైట్స్… చుట్టూరా కలర్ ఫుల్ ఫ్యామిలీ… ఇప్పటి వరకు రామ్ సినిమాలంటే ఇవే.. కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ ఎనర్జిటిక్ స్టార్ కరియర్ లో ఓ కొత్త పేజీనే క్రియేట్ చేసింది. అందుకే ఈ హీరో ఫ్యూచర్ సినిమాలపై ఇంట్రెస్టింగ్ డిస్కర్షన్స్ నడుస్తున్నాయి.

‘ఇస్మార్ట్ శంకర్’ తరవాత రామ్ ఎలాంటి సినిమాలు ప్లాన్ చేసుకోబోతున్నాడు… చాక్లెట్ బాయ్ లుక్స్ నుండి ఊర మాస్ హీరో లా ట్రాన్స్ ఫామ్ అయిన ఈ ఎనర్జిటిక్ స్టార్… ఈ సినిమా తరవాత ఎలాంటి సినిమాలు ఎంచుకుంటాడు అనేది చూడాలి… ఇకపై ఎలాంటి ఇమేజ్ ని సొంతం చేసుకుంటాడు అనేది చూడాలి.