సెట్స్ పైకి వచ్చిన మహానటి

Monday,May 29,2017 - 02:30 by Z_CLU

మహానటి సెట్స్ పైకి వచ్చేసింది. సీనియర్ నటి సావిత్రి క్యారెక్టర్ లో కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమా కోసం చాన్నాళ్ళుగా ప్రీ ప్రొడక్షన్ నడుస్తుంది. సమంత ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించనుంది. సావిత్రి గారి లైఫ్ కి సంబంధించి మ్యాగ్జిమం రీసెర్చ్ తర్వాత, కాస్ట్ సెలెక్షన్ మీద దృష్టి పెట్టిన సినిమా యూనిట్, ఎట్టకేలకు ప్రీ ప్రొడక్షన్ కి ప్యాకప్ చెప్పి సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చింది.

ఈ సినిమాలో జెమినీ గణేషన్ క్యారెక్టర్ ని తమిళ నటుడు దుల్కర్ సల్మాన్ నటిస్తుండగా, మరో కీలక పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్నట్టు తెలుస్తుంది.  నాగ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు.