‘కథలో రాజకుమారి’ రిలీజ్ డేట్ ఫిక్స్

Monday,May 29,2017 - 03:16 by Z_CLU

డిఫెరెంట్ టైటిల్ తో ఆ తరవాత అంతే ఇంటరెస్టింగ్ టీజర్ తో ఎట్రాక్ట్ చేసిన ‘కథలో రాజకుమారి’ రిలీజ్ డేట్ ఫిక్సయింది. మేస్ట్రో ఇళయరాజా, విశాల్ చంద్రశేఖర్ సంయుక్తంగా కంపోజ్ చేసిన ఈ సినిమా ఆడియోని కూడా రైట్ టైమ్ చూసుకుని రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.

నారా రోహిత్, నాగ శౌర్య నటిస్తున్న ఈ సినిమాలో నమితా ప్రమోద్ హీరోయిన్ గా నటిస్తుంది. డిఫెరెంట్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాని జూన్ 30 న రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్. మహేష్ సూరపనేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని వెంకట శ్రీనివాస్ నిర్మిస్తున్నారు.