‘లై’ సినిమాపై రోజు రోజుకి పెరుగుతున్న క్రేజ్

Monday,August 14,2017 - 11:56 by Z_CLU

నితిన్ ‘లై’ బాక్స్ లు బద్దలుకొట్టే పనిలో ఉంది. ఆగష్టు 11 న గ్రాండ్ గా రిలీజ్ అయిన అయిన ఈ సినిమా రిలీజ్ కి ముందు ఏ రేంజ్ హైప్ ని క్రియేట్ చేసిందో, రిలీజ్ తరవాత కూడా అదే రేంజ్ క్రేజ్ తో దూసుకుపోతుంది. సినిమాలో హీరోకి ధీటుగా నిలిచిన యాక్షన్ కింగ్ అర్జున్ పర్ఫామెన్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సందర్భంగా నిన్న థాంక్స్ గివింగ్ మీట్ లో పాల్గొన్న సినిమా యూనిట్, త్వరలో సక్సెస్ టూర్ ని కూడా ప్లాన్ చేస్తుంది.

సినిమాలో హీరోకి, విలన్ కి మధ్య నడిచే థ్రిల్లింగ్ మైండ్ గేమ్, మేఘా ఆకాశ్ గ్లామర్, హను స్టైలిష్ మేకింగ్, U.S. లోని ఎగ్జోటిక్ లొకేషన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ‘లై’ సినిమాకి సంబంధించి ప్రతి అంశం సినీటౌన్ లో ఇంటరెస్టింగ్ టాక్ లా మారింది.

 

సినిమా రిలీజ్ కి ముందే పాటలతో భారీ అంచనాలను క్రియేట్ చేసిన మణిశర్మ, సినిమా రిలీజ్ తరవాత బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టాడు. ఈ లాంగ్ వీకెండ్ ని ఎక్స్ ట్రా  ఆర్డినరి ఎంటర్ టైనింగ్ వీకెండ్ లా మార్చేసింది లై.