ఒక్క సినిమాతోనే ఇంత క్రేజ్

Thursday,August 10,2017 - 06:23 by Z_CLU

ఫస్ట్ సినిమాకే ఎక్స్ పెక్ట్ చేయని రేంజ్ లో ఫాలోయింగ్ క్రియేట్ అయింది మేఘా ఆకాష్ కి. ‘లై’ సినిమాలో నితిన్ సరసన చాన్స్ కొట్టేసిన ఈ ముద్దుగుమ్మ పైనే ఉంది టాలీవుడ్  మ్యాగ్జిమం కాన్సంట్రేషన్. దానికి తోడు లై సినిమాకి జరుగుతున్న భారీ ప్రమోషన్స్ తో మేఘా ఆకాష్ చాలా ఎగ్జైటెడ్ గా ఉంది.

నితిన్ ని డిఫెరెంట్ లుక్ లో ప్రెజెంట్ చేస్తున్న ‘లై’ సినిమా రేపు గ్రాండ్ గా రిలీజ్ కానుంది. హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్, మేఘా ఆకాష్ ని జస్ట్ ఒక సినిమాతో స్టార్ హీరోయిన్ రేస్ కి క్వాలిఫై చేయడం గ్యారంటీ అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.