నితిన్ ‘లై’ షూటింగ్ కంప్లీట్ అయింది

Thursday,July 20,2017 - 12:06 by Z_CLU

ఆగష్టు 11 న రిలీజ్ కి రెడీ అవుతుంది నితిన్ ‘లై’. నిన్న రిలీజైన సెకండ్ సింగిల్ ‘మిస్ సన్ షైన్’ సోషల్ మీడియాలో మంచి స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది. ఇకపోతే అద్భుతమైన లొకేషన్స్ లలో లావిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆల్ మోస్ట్ షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసింది. యాక్షన్ కింగ్ అర్జున్ కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అవుతున్నాయి.

హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తుంది. ‘ LIE’ అనే ఇంటరెస్టింగ్ టైటిల్ తో మ్యాగ్జిమం అటెన్షన్ గ్రాబ్ చేసిన సినిమా యూనిట్, ఆ తరవాత రిలీజ్ అయిన ఫస్ట్ లుక్స్, టీజర్స్ తో సినిమాపై మరింత క్రేజ్ ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. ‘లై’ నితిన్ కరియర్ లో బెస్ట్ మూవీగా నిలవడం ఖాయం అంటున్నాయి ఇన్ సైడ్ సోర్సెస్. ఇకపోతే ఈ సినిమాని రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.