రొటీన్ గా ఉండకూడదని ఫిక్స్ అయ్యాం: నితిన్

Monday,August 14,2017 - 01:10 by Z_CLU

అ..ఆ.. సినిమా తరవాత రెగ్యులర్ సినిమా చేయకూడదని ఫిక్స్ అయి సంతకం చేసిన సినిమా ‘లై’ అన్నాడు నితిన్, నిన్న జరిగిన థాంక్స్ గివింగ్ మీట్ లో. ఎలాంటి సినిమా చేస్తానో తెలీదు కానీ, రొటీన్ సినిమా మాత్రం చేయకూడదు… రిస్కైనా పర్వాలేదు కానీ, ఈ సారి మాత్రం సమ్ థింగ్ డిఫెరెంట్ సినిమా చేయాలి అని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిన టైమ్ లో హను సినిమా లైన్ చెప్పాడు. ఇమ్మీడియట్ గా ఓకె చెప్పేశానని అన్నాడు నితిన్.

 ఓ వైపు లవర్ బాయ్ లా సక్సెస్ ట్రాక్ ని క్రియేట్ చేసుకున్న నితిన్, అ..ఆ.. తో ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరై,  ‘లై’ సినిమాతో ఆల్ రౌండర్ అనిపించుకున్నాడు. సినిమా రిలీజైన ఫస్ట్ డే, కాస్త డివైడ్ టాక్ వినిపించినా నెక్స్ట్ డే నుండి ఈ సినిమాపై పెరిగిన క్రేజ్, రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఏదైనా కొత్తగా ట్రై చేస్తే సక్సెస్ గ్యారంటీ అని ప్రూఫ్ చేసింది లై. దాదాపు సంవత్సరం పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డ నితిన్, ఈ రేంజ్ లో సినిమాని సక్సెస్ చేసిన ఆడియెన్స్ కి థాంక్స్ చెప్పుకున్నాడు.

 

నిన్న జరిగిన ఈ థాంక్స్ మీట్ లో హీరో నితిన్, యాక్షన్ కింగ్ అర్జున్, మేఘా ఆకాష్, డైరెక్టర్ హను రాఘవపూడి తో పాటు ప్రొడ్యూసర్స్ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం సెలెబ్రేషన్ మూడ్ లో లై టీమ్, త్వరలో సక్సెస్ టూర్ కూడా ప్లాన్ చేస్తుంది.