'లక్ష్మీస్ NTR' ట్రైలర్ రిలీజయింది

Thursday,February 14,2019 - 10:13 by Z_CLU

వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ట్రైలర్ రిలీజ్ అని అనౌన్స్ చేసినట్టుగానే ‘లక్ష్మీస్ NTR’ ట్రైలర్ రిలీజ్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ కాని ఈ సినిమాలో వర్మ ముందు నుండి చెప్తున్నట్టు, NTR లైఫ్ లోని లాస్ట్ ఫేజ్ ని ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేశాడు RGV.

ట్రైలర్ ని బట్టి 1989 ఎన్నికలలో ఓడిపోయిన తరవాత NTR కి కుటుంబ సభ్యుల మధ్య వచ్చిన గ్యాప్, ఈ లోపు జీవిత చరిత్ర రాసే ప్రాసెస్ లో NTR కి లక్ష్మీ పార్వతి దగ్గరవ్వడం, దాంతో కుటుంబంలో క్రియేట్ అయిన డిస్టబెన్స్ ని ఈ సినిమాలో కీలక అంశం గా తెరకెక్కిస్తున్నాడు RGV. 3:10 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్ లో RGV మార్క్ క్లియర్ గా కనిపిస్తుంది.

ఎ జివి ఆర్జీవి ఫిల్మ్స్ ప్రెజెంట్స్

దర్శకత్వం :రాం గోపాల్ వర్మ & అగస్త్య మంజు

ప్రొడ్యూసర్ :రాకేష్ రెడ్డి &దీప్తి బాలగిరి

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : రమ్మీ

రచన : రాం గోపాల్ వర్మ&నరేంద్ర చారి

మ్యూజిక్ : కళ్యాణ్ కోడూరి

ఎడిటర్ : కమల్ ఆర్

కాస్ట్యూమ్ డిజైనర్ : వెంకటేష్ జక్కుల

కొరియోగ్రఫీ : శంకర్ మాస్టర్

లిరిక్స్ : సిరా శ్రీ

పి ఆర్ ఓ : జీ ఎస్ కే మీడియా

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సూర్య చౌదరి

ప్రొడక్షన్ కంట్రోలర్ : పాండి

సౌండ్ డిజైన్ : యతి రాజు