లుక్ మాత్రమే కాదు.. క్యారెక్టర్ కూడా షాకింగ్!

Thursday,February 14,2019 - 10:03 by Z_CLU

అనుష్క స్లిమ్ లుక్ వచ్చేసింది. అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. నిన్నట్నుంచి ఇప్పటివరకు ఈ స్టిల్ వైరల్ అవుతూనే ఉంది. అయితే ఇప్పుడు దీనికి కొనసాగింపుగా మరో న్యూస్ హల్ చల్ చేస్తోంది. ఆమె మేకోవర్ తో పాటు కొత్త సినిమాలో ఆమె క్యారెక్టర్ కూడా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుందట.

కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా సైలెన్స్ అనే సినిమా నిర్మించబోతోంది. హేమంత్ మధుకర్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సైలెన్స్ అనే పేరు పెట్టారు. ఇందులో అనుష్కది మెయిన్ రోల్. మాధవన్, అంజలి, షాలినీపాండే, అవసరాల శ్రీనివాస్ లాంటి నటులు ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో అనుష్క క్యారెక్టర్ అందర్నీ షాకింగ్ కు గురిచేస్తుంది అంటున్నాడు ఈ సినిమా నిర్మాత కోన వెంకట్.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అని టాక్..  ఇందులో అనుష్కకు చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయట. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది.