'మజిలీ' టీజర్ రివ్యూ

Thursday,February 14,2019 - 12:48 by Z_CLU

నాగ చైతన్య, సమంతా పెళ్ళి తరవాత జంటగా నటించిన మొట్ట మొదటి సినిమా. అందుకే ‘మజిలీ’ సెట్స్ పైకి వచ్చినప్పటి నుండే అంచనాలున్నాయి. ఈ రోజు వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ అనగానే న్యాచురల్ గానే ఫ్యాన్స్ మరింత ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఆ అంచనాలను 100% అందుకుంది ఈ టీజర్.

క్రికెటర్ అవ్వాలన్నా ఆంబిషన్, ప్రేమించిన అమ్మాయి… ఇవీ రెండూ దక్కని ఫెయిల్యూర్ రోల్ లో నటించాడు నాగచైతన్య ఈ సినిమాలో. పెళ్ళి తరవాత కూడా గ్లామరస్ రోల్స్ లో మెస్మరైజ్ చేసిన సమంతా, ఈ సినిమాలో హోమ్లీ లుక్ లో, మరింత ఎట్రాక్టివ్ గా కనిపిస్తుంది.

‘నువ్వు నా రూమ్ లోపలి రాగలవేమో కానీ, నా మనసు లోకి మాత్రం రాలేవు…’ అనే డైలాగ్, ఇద్దరి రిలేషన్ షిప్ లో ఉన్న కాన్ఫ్లిక్ట్ ని రివీల్ చేస్తే, తన భర్త గురించి చెడు చెప్పకుండా ‘ఆయనకు మంచు ప్రదేశాలంటే మహా ఇష్టం..’ అని చెప్పే డైలాగ్ సమంతా క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తుంది. అల్టిమేట్ గా జస్ట్ 1:16 సెకన్ల నిడివిలో ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా  సినిమా స్టోరీలైన్ చెప్పిన మేకర్స్,  ఈ టీజర్ తో ‘మజిలీ’  పై పాజిటివ్ వైబ్స్ ని క్రియేట్ చేస్తున్నారు.

శివ నిర్వాన డైరెక్షన్ లో తెరకెక్కుతుంది మజిలీ.  సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజర్. ఏప్రిల్ 5 న రిలీజవుతుంది ఈ సినిమా.