నిహారిక కొణిదెల ఇంటర్వ్యూ

Thursday,July 26,2018 - 05:40 by Z_CLU

నిహారిక, సుమంత్ అశ్విన్ జంటగా నటించిన బ్యూటిఫుల్ లవ్ ఎంటర్ టైనర్ హ్యాపీ వెడ్డింగ్. లక్ష్మణ్ కార్య డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 28 న గ్రాండ్ గా రిలీజవుతుంది. అక్షరగా ఈ సినిమాలో మెస్మరైజ్ చేయనున్న నిహారిక కొణిదెల ఈ సినిమా గురించి, తన ఫ్యూచర్ సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది అవి మీకోసం…

కోరిక ఇప్పటిది కాదు…

ఇండస్ట్రీకి రాకముందు నుండే ఒక పెద్ద ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయాలని ఉండేది. ఆ కోరిక ఈ సినిమాతో  తీరింది…

పిక్నిక్ లా అనిపించింది…

ఈ సినిమా చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. వండర్ ఫుల్ టీమ్.  అంతమంది సీనియర్ ఆర్టిస్టులున్నా అందరూ కొత్త, పాత అని తేడా లేకుండా ఫ్యామిలీలా కలిపోయి చేశాం సినిమాని…

అదీ సంగతి…

సినిమాలో స్పెషల్ గా లవ్ స్టోరీ లాంటిదేమీ ఉండదు. సినిమా బిగినింగ్ లోనే మ్యారేజ్ అరేంజ్ అవుతుంది. అక్కణ్ణించి బిగిన్ అయితే హ్యాప్పీ వెడ్డింగ్ వరకు చేసే జర్నీ ఈ సినిమా… లవ్ లో ఉన్నప్పుడు హీరో ఎలా చూసుకుంటాడో, పెళ్ళి తరవాత కూడా అలాగే చూసుకోవాలి అనుకుంటుంది.. కానీ అలా జరగదు. ఎందుకు ఆ చేంజ్ అనేదే సినిమా…

నేనే విలన్…

ఈ సినిమాలో నా పేరు అక్షర. ఈ సినిమాలో పర్టికులర్ గా విలన్ అంటూ ఎవరూ లేదు. సినిమాలో ఏదైనా కాంఫ్లిక్ట్ క్రియేట్ అయిందంటే అది నా క్యారెక్టర్ తీసుకునే డెసిషన్స్ వల్లే..

నా ఫస్ట్ ప్రిఫరెన్స్ సినిమా కాదు…  

సినిమాలు నాకెప్పుడూ ఫస్ట్ ప్రయారిటీ కాదు. మహా అయితే ఇంకో 4 టు 5 ఇయర్స్ సినిమాలు చేస్తానేమో. నాకు మూవీ ప్రొడక్షన్ చూసుకోవడం అంటే ఇష్టం. నాన్నగారితో ఉండి చాలా నేర్చుకున్నాను. వెబ్ సిరీస్ కూడా చేయాలని ఉంది.

అందుకే అలా…

రేపటి రోజున సినిమాలు ఆపేశాక వెనక్కి తిరిగి చూసుకుంటే నేను చేసిన సినిమాలు నాకు నచ్చాలి. అయ్యో ఈ సినిమా ఎందుకు చేశానా అనే ఫీలింగ్ రాకూడదు. అందుకే హీరో ఎవరా అని చూడకుండా నాకు నచ్చిన సినిమాలే చేస్తున్నా.

అది మాత్రం కంపల్సరీ…

నేను సినిమాల విషయంలో చూజీగా ఉంటాను అని చెప్పలేను కానీ, ఏ సినిమా చేసినా అందులో ఎంతో కొంత నేను ప్లే చేసే క్యారెక్టర్ కాంట్రిబ్యూషన్ ఉండాలి అనుకుంటా.

అందుకే డెబ్యూ డైరెక్టర్స్…

ఇప్పుడు ఇండస్ట్రీ లో సెటిలై ఉన్న ఏ పెద్ద డైరెక్టర్స్ ని చూసినా, వాళ్ళ ఫస్ట్ మూవీ అద్భుతంగా ఉంటుంది. ఎలాగైనా ఇండస్ట్రీలో నిలబడాలన్న కసితో ఆ సినిమా చేస్తారు. నా విషయానికి  వచ్చేసరికి నేను డెబ్యూ డైరెక్టర్స్ నే పిక్ చేసుకోవడం లేదు కానీ ఆ కసి మాత్రం వాళ్ళలో కనిపిస్తుంది.

అదీ సుమంత్ అశ్విన్…

ఈ సినిమా సెట్స్ పైకి రాకముందు సుమంత్ అశ్విన్ గురించి పెద్దగా తెలీదు. తను నటించిన సినిమాలు చూశాను కానీ పర్సనల్ గా తెలీదు. సినిమా స్టార్ట్ అయ్యాక అబ్జర్వ్ చేసిందేమిటంటే చాలా రిజర్వ్డ్ గా ఉంటాడు. సీన్ షూట్ కి ముందు వచ్చి ఇద్దరం ఎలా పర్ఫామ్ చేయాలో డిస్కస్ చేస్తాడు అంతవరకే.

 

కాన్సంట్రేషన్ వెబ్ సిరీస్ పైనే…

ప్రస్తుతం నా కాన్సంట్రేషన్ వెబ్ సిరీస్ పైనే… ప్రస్తుతం  నేను చేసిన వెబ్ సిరీస్ డైరెక్టర్ తో ఫీచర్ ఫిల్మ్ చేస్తున్నాను. కానీ ఈ సినిమా తర్వాత ఇమ్మీడియట్ గా వెబ్ సిరీస్ ఉంటుంది.

అల్టిమేట్ గా నేనే…

స్టోరీస్ వినేది అల్టిమేట్ గా నేనే… ఫైనల్ అనుకున్న తరవాత నాన్నను వినమని చెప్తా… అన్నయ్య అంత డీటేల్డ్ గా వినడు కానీ లైన్ చెప్తా… ఎవరు విన్నా చివరికి నాకు ఫ్రీడమ్ ఇస్తారు.. ఒకవేళ ఫ్లాప్ అయినా.. పడితేనే కదా తెలుస్తుంది అంటారు..

ప్రణీత్ డైరెక్షన్ లో…

ప్రస్తుతం ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ అయిపోయింది.   ఆగష్టు ఫస్ట్ వీక్ లో రాజస్థాన్ వెళుతున్నాం. ఆ తరవాత సాంగ్స్ తో పాటు కొన్ని సీన్స్ చేస్తే సినిమా షూటింగ్ అయిపోతుంది. ఈ సినిమాలో రాహుల్ విజయ్ హీరో…

‘సైరా’లో చేస్తున్నా…

‘సైరా’ లో చిన్న రోల్ అయినా చేస్తానని చరణ్ అన్నని అడిగితే డైరెక్టర్ ని అడగమన్నారు. సురేందర్ రెడ్డి గారిని అడిగితే ఒక చిన్న రోల్ ఇచ్చారు. మహా అయితే 2 సీన్స్ లో కనిపిప్తాను. ఒక సీన్ అయిపోయింది. ఇంకో సీన్ ఎప్పుడు ఉంటుంది అనడిగితే నెక్స్ట్ ఇయర్ అని చెప్పారు… ఎప్పుడు ఉంటుందో తెలీదు.