చెర్రీ చీఫ్ గెస్ట్ గా హ్యాపీ వెడ్డింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్

Friday,July 20,2018 - 04:02 by Z_CLU

టాలీవుడ్ లో వెడ్డింగ్ సీజన్ బిగిన్ అయిందా అనిపిస్తుంది. నిహారిక, సుమంత్ అశ్విన్ జంటగా నటించిన ‘హ్యాప్పీ వెడ్డింగ్’ సినిమా ఈ నెల 28 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్ ప్రాసెస్ స్పీడ్ పెంచిన ఫిల్మ్ మేకర్స్ రేపు గ్రాండ్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోనున్నారు. ఈ ఈవెంట్ కి మెగా పవర్  స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవుతుండటంతో ఈ ఈవెంట్ పై మరింత కాన్సంట్రేషన్ పెరిగిపోయింది.

ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయి ఉంది. దానికి తోడు రేపు జరగబోయే ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ ఈ సినిమా గురించి ఏం చెప్పబోతున్నాడా క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో రేజ్ అవుతుంది.

ఇప్పటికే ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు పెంచేసిన ఫిల్మ్ మేకర్స్ సినిమా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అటు లవ్ ఇమోషన్స్ తో పాటు ఫ్యామిలీ బాండింగ్ లాంటి కనెక్టింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా లక్ష్మణ్ కార్య డైరెక్షన్ లో తెరకెక్కింది. శక్తికాంత్ మ్యూజిక్ కంపోజర్. UV క్రియేషన్స్ బ్యానర్ మరియు పాకెట్ సినిమా ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించారు.