అడివి శేష్ హీరోగా నటించిన ‘గూఢచారి’ ట్రైలర్ రిలీజయింది. ఆగష్టు 3 న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాపై బిగినింగ్ నుండే మినిమం ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఆ ఎక్స్ పెక్టేషన్స్ రోజు రోజుకి పెంచే పనిలోనే ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. రీసెంట్ గా రిలీజైన ఫస్ట్ సింగిల్ ‘అనగనగా’ యూత్ లో ఈజీగా రీచ్ అయింది. ఆ బజ్ కి తోడు ఈ రోజు రిలీజైన 1:44 సెకన్ల ట్రైలర్ అసలీ అర్జున్ ఎవరు అనే క్వశ్చన్ రేజ్ చేస్తుంది.
పెద్దయ్యాక తండ్రిలా దేశాన్ని కాపాడే RAW ఏజెంట్ అవ్వాలనేది అర్జున్ కల. అయితే అర్జున్ గతం ఏంటి..? తన తండ్రిని చంపింది ఎవరు…? అసలు తండ్రితో పాటు తను కూడా చనిపోయాడని ప్రపంచానికి చెప్పి, పేరు మార్చుకుని అర్జున్ లా ఎందుకు బ్రతకాల్సి వచ్చింది..? అసలు అర్జున్ హ్యాండిల్ చేసే మిషన్ ఏంటి..? ఇలా చెప్పుకుంటూ పోతే గూఢచారి ట్రైలర్ రేజ్ చేస్తున్న క్వశ్చన్స్ ఎన్నో…
ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో కరియర్ ప్లాన్ చేసుకుంటున్న అడివి శేష్ రేంజ్ పెంచే సినిమా గూఢచారి. ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు సినిమాలో కీ రోల్ ప్లే చేయనున్న సస్పెన్స్ ఎలిమెంట్స్ ఈ ‘గూఢచారి’ కి బిగ్గెస్ట్ ఎసెట్స్.
ఈ సినిమాలో అడివి శేష్ సరసన శోభిత హీరోయిన్ గా నటిస్తుంది. శశికిరణ్ తిక్క డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని అభిషేక్ నామా, TG విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.