ఆ ఇద్దరి తరువాతే...

Saturday,May 27,2017 - 10:00 by Z_CLU

మిర్చి- శ్రీమంతుడు-జనతా గ్యారేజ్ సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ కి ప్రెజెంట్ టాలీవుడ్ లో మంచి డిమాండే ఉంది.. ఇప్పటికే ఈ డైరెక్టర్ తో కొందరు స్టార్ హీరోలు ఓ సినిమా చేయాలని భావిస్తుండగా కొరటాల మాత్రం వారికి ఇప్పుడే నో ఛాన్స్ అంటున్నాడు.

ప్రెజెంట్ మహేష్ తో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్న కొరటాల ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ తో ఓ సినిమా చేయబోతున్నాడని, ఈ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా ఆల్మోస్ట్ కంఫర్మ్ అయిపోయిందనే వార్త మొన్నటి వరకూ వినిపించగా లేటెస్ట్ గా కొరటాల లిస్ట్ లోకి సడెన్ గా వచ్చి చేరాడు ఎన్టీఆర్.. ఇటీవలే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కే రెండో సినిమాను నిర్మాత మిక్కిలినేని సుధాకర్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెల్సిందే.. సో మహేష్ ఎన్టీఆర్ సినిమాల తర్వాతే కొరటాల మరో హీరోతో సినిమా ప్లాన్ చేస్తాడని ప్రస్తుతం  కొరటాల ఫోకస్ అంతా  వీరిద్దరి మీదే ఉంటుందని సమాచారం.  మరి మహేష్- ఎన్టీఆర్ తర్వాత కొరటాల డైరెక్ట్ చేయబోయే ఆ హీరో ఎవరో  తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చెయ్యక తప్పదు మరి..