దంగల్.. 1600 కోట్లు.. నాటౌట్

Saturday,May 27,2017 - 11:01 by Z_CLU

ఊహించని విదంగా బాహుబలి-2 సినిమాకు పోటీగా నిలిచింది దంగల్ మూవీ. ఈ సినిమా ఫైనల్ రన్ కంప్లీట్ అయిందని అంతా అనుకున్న టైమ్ లో చైనాలో విడుదలైన దంగల్ కళ్లుచెదిరే వసూళ్లు రాబడుతోంది. అమీర్ నటించిన ఈ నిజజీవిత గాథ.. చైనా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అలా ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని రేంజ్ లో హిట్ అయిన దంగల్ మూవీ.. తాజాగా 1600 కోట్ల క్లబ్ లోకి ఎంటరైంది.

నిన్నటి వసూళ్లతో కలుపుకొని చైనాలో 825 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది దంగల్ మూవీ. వీటికి తైవాన్ కలెక్షన్లు అదనం. తైవాన్ లో దంగల్ కు 31 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇక ఇండియాతో కలుపుకొని రెస్టాఫ్ ది వరల్డ్ విభాగంలో 744 కోట్ల రూపాయలు వచ్చాయి దంగల్ సినిమాకి. ఈ లెక్కలన్నీ కలుపుకుంటే నిన్నటికి దంగల్ సినిమా 1600 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయింది.

మల్లయోధుడిగా అమీర్ నటించిన ఈ మూవీ చైనాలో విడుదలై 3 వారాలు కంప్లీట్ అయినా స్టిల్ ఇంకా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఇంకా చెప్పాలంటే ఇండియాలో ప్రస్తుతం బాహుబలి-2 ఎంత స్ట్రాంగ్ గా ఉందో, చైనాలో దంగల్ అంత స్ట్రాంగ్ గా నడుస్తోంది. త్వరలోనే ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయం.