టాలివుడ్ లో కోలీవుడ్ రీమేక్స్

Sunday,April 07,2019 - 04:07 by Z_CLU

చిన్న సినిమాలుగా విడుదలై సెన్సేషనల్ హిట్ సాదించిన కొన్ని తమిళ సినిమాలు తెలుగులో రీమేక్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం  బజ్ ఉన్న ఓ మూడు తమిళ సినిమాలు టాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం.

 

2014 లో రిలీజయిన తమిళ సినిమా ‘జిగర్తాండ’ను ఇప్పుడు ‘వాల్మికి’ పేరుతో తెలుగులో రీమేక్ అవుతోంది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లేతో కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా తెలుగులో కూడా అదే రేంజ్ హిట్ అవుతోందనే అంచనాలున్నాయి. పైగా ‘దబాంగ్’ లాంటి హిందీ సినిమాను తెలుగులో ‘గబ్బర్ సింగ్’గా రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న హరీష్ శంకర్ ఈ సినిమాను రీమేక్ చేస్తుండడంతో ‘వాల్మికి’ ఎవైటింగ్ మూవీ అనిపించుకుంది.

గతేడాది తమిళ నాట సెన్సేషన్ హిట్ సాదించిన ’96’ కూడా తెలుగులో రీమేక్ అవుతోంది. విజయ్ సేతుపతి -త్రిష జంటగా నటించిన ఈ సినిమాను ఏరి కోరి మరీ తెలుగు రైట్స్ తీసుకున్నాడు దిల్ రాజు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసుకున్న ఈ రీమేక్ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది. శర్వా-సమంత హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను తమిళ్ లో తెరకెక్కించిన దర్శకుడే తెలుగులోనూ డైరెక్ట్ చేస్తుండడం విశేషం. ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి.

టాలీవుడ్ లో మోస్ట్ ఎవైటింగ్ రీమేక్ లో ‘రట్సాసన్’ ఒకటి. లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో విడుదలైన ఈ తమిళ సినిమాను రమేష్ వర్మ తెలుగులో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బెల్లం కొండ శ్రీనివాస్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. క్రీం థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ని కూడా అదే రీతిలో థ్రిల్ చేస్తుందని నమ్ముతున్నారు మేకర్స్.

ఇక 2017లో విడుదలైన తమిళ సినిమా ‘విక్రమ్ వేద’ను కూడా తెలుగులో రీమేక్ ఆలోచనలో ఉన్నారు. అయితే ఇంత వరకూ ఈ రీమేక్ కి సంబంధించి ఎలాంటి అనౌన్స్ రాలేదు. కాని త్వరలోనే ఓ ప్రొడక్షన్ హౌజ్ నుండి ఈ రీమేక్ అనౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది.