మార్చ్ మూడో వారంలో 'కోతి కొమ్మచ్చి' !

Friday,February 19,2021 - 05:48 by Z_CLU

కుటుంబ కథా చిత్రాల దర్శకుడు వేగేశ్న సతీష్ డైరెక్షన్ లో మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న లు హీరోలుగా  నటిస్తున్న ‘కోతి కొమ్మచ్చి’ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇటివలే సింగిల్ షెడ్యుల్ లో అమలాపురం, వైజాగ్ లోకేషన్స్ లో షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చ్ మూడో వారంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.  త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారని సమాచారం.

ప్రస్తుతం  శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి త్వరలోనే సాంగ్స్ రిలీజ్ కానున్నాయి. లక్ష్య [ప్రొడక్షన్స్ బేనర్ పై ఎం.ఎల్.వి.సత్యానారాయణ నిర్మిస్తున్న ఈ యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో మేఘా చౌదరి ,  రిద్ది కుమార్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్ , నరేష్ ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు.