జీ సినిమాలు (7th ఏప్రిల్)

Tuesday,April 06,2021 - 10:11 by Z_CLU

thumbaa-zee-cinemalu-225x320

తుంబా

నటీనటులు : దశన్, KPY ధీన, కీర్తి పాండ్యన్

ఇతర నటీనటులు : ధరణి వాసుదేవన్, జార్జ్ విజయ్ నెల్సన్, కళైయారసన్ కన్నుసామి మరియు తదితరులు

మ్యూజిక్ కంపోజర్ : అనిరుద్ రవిచందర్, వివేక్ మెర్విన్, సంతోష్ దయానిధి

డైరెక్టర్ : హరీష్ రామ్ L.H.

ప్రొడ్యూసర్ : సురేఖ న్యాపతి

రిలీజ్ డేట్ : 21 జూన్ 2019

అనుకోకుండా అడవిలోకి వచ్చి పడిన పులి (తుంబా), దానిబిడ్డ చుట్టూ తిరిగే కథే తుంబా. అలా ప్రమాదవశాత్తు అడివిలోకి వచ్చిన ఈ రెండింటి లెక్క గవర్నమెంట్ రికార్డ్స్ లో ఎలాగూ ఉండదు కాబట్టి వీటిని అమ్ముకుని ఎలాగైనా సొమ్ము చేసుకోవాలనే ఆలోచనలో ఉంటాడు అక్కడి ఫారెస్ట్ ఆఫీసర్. ఇదిలా ఉంటే ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్ళి ఫోటోస్ తీయడానికి పర్మిషన్ తీసుకున్న వర్ష తో పాటు, ఆ అడవికి దగ్గరలో పులి రియల్ స్టాచ్యూ తయారు చేసే పనిలో ఉన్న మరో ముగ్గురు ఈ విషయాన్ని గ్రహించి ఎలాగైనా ఆ పులిని, దానిబిడ్డని ఆ ఫారెస్ట్ ఆఫీసర్ నుండి కాపాడాలనుకుంటారు. ఇంతకీ తుంబని, దాని బిడ్డని వీళ్ళు కాపాడగలిగారా..? లేదా అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

_______________________________

గోరింటాకు

నటీనటులు : రాజ శేఖర్ఆర్తి అగర్వాల్ మీరా జాస్మీన్
ఇతర నటీనటులు : ఆకాష్హేమ చౌదరి,సుజితశివ రాజామాస్టర్ నిధీశ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్.ఎ.రాజ్ కుమార్
డైరెక్టర్ : వి.ఆర్.ప్రతాప్
ప్రొడ్యూసర్ : ఎం.వి.ప్రసాద్పారస్ జైన్
రిలీజ్ డేట్ : జులై 4 , 2008

అన్న-చెల్లెళ్ళ బంధం కధాంశం తో రాజ శేఖర్ఆర్తి అగర్వాల్మీరా జాస్మీన్ నటించిన ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎవర్ గ్రీన్ ఫామిలీ ఎంటర్టైనర్ గా నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో రాజ శేఖర్-మీరా జాస్మీన్ ల మధ్య వచ్చే సన్నివేశాలుఅన్న-చెల్లెళ్ళ బంధం గురించి తెలియజేసే సీన్స్ సినిమాకు హైలైట్స్. ఎస్.ఎ.రాజ్ కుమార్ అందించిన పాటలుఆర్.ఆర్. సినిమాకు ప్లస్.

__________________________________________

Rakhi-zee-cinemalu1-551x320-551x320

రాఖీ

నటీనటులు : NTR, ఇలియానా, చార్మి

ఇతర నటీనటులు : సుహాసిని, రవి వర్మ, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, చంద్ర మోహన్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : కృష్ణవంశీ

ప్రొడ్యూసర్ : K.L. నారాయణ

రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2006

NTR, కృష్ణవంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన రాఖీ ఇద్దరి కరియర్ లోను డిఫరెంట్ సినిమా. ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక యువకుడు చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని పోరాటం చేయడమే రాఖీ సినిమా ప్రధానాంశం. ఈ సినిమాలో ఛార్మి నటన హైలెట్.

___________________________________

mister-zee-cinemalu-586x308

మిస్టర్

నటీనటులు : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి
ఇతర నటీనటులు : హేబా పటేల్, నిఖితిన్ ధీర్, ప్రిన్స్ సీసిల్, పృథ్వీ రాజ్, హరీష్ ఉత్తమన్, రవి ప్రకాష్,
సత్యం రాజేష్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ. జె. మేయర్
డైరెక్టర్: శ్రీను వైట్ల
ప్రొడ్యూసర్ : నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు
రిలీజ్ డేట్ : 14 ఏప్రిల్ 2017

చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి తాతకు దూరంగా తన కుటుంబంతో యూరప్ లో జీవితాన్ని కొనసాగిస్తున్న పిచ్చై నాయుడు (వరుణ్ తేజ్) అనుకోని సందర్భంలో యూరప్ కి వచ్చిన మీరా(హెబ్బా పటేల్) తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. మీరా యూరప్ వదిలి వెళ్ళేలోపు తన ప్రేమను చెప్పాలనుకున్న చై.. మీరా చెప్పిన ఓ నిజం విని షాక్ అవుతాడు… అలా మీరా జీవితం గురించి తెలుసుకొని షాక్ అయిన చై జీవితంలోకి చంద్రముఖి(లావణ్య త్రిపాఠి) అనే అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది.

ఇంతకీ మీరా, చై కి ఏం చెప్పింది? చై జీవితంలోకి అనుకోకుండా వచ్చిన చంద్రముఖి ఎవరు? చివరికి వీరిద్దరిలో చై ఎవరిని పెళ్లిచేసుకుంటాడు.. ఇక చిన్నతనంలోనే చై తన తాతకి దూరం అవ్వడానికి కారణం ఏమిటి.? ఫైనల్ గా చై మళ్ళీ తన తాతయ్యను ఎలా కలిశాడు.. అనేది సినిమా కథాంశం.

________________________________________

రారండోయ్ వేడుక చూద్దాం

నటీనటులు : అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : జగపతి బాబు, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, పృథ్విరాజ్, చలపతి రావు మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : కళ్యాణ్ కృష్ణ కురసాల
ప్రొడ్యూసర్ : నాగార్జున అక్కినేని
రిలీజ్ డేట్ : 26 మే 2017

పల్లెటూరిలో ఓ పెద్దమనిషిగా కొనసాగే ఆది(సంపత్) ఏకైక కూతురు భ్రమరాంబ(రకుల్ ప్రీత్) చిన్నతనం నుంచి నాన్న గారాల పట్టిగా పెరిగి పెద్దవుతుంది. అలా నాన్నని కుటుంబాన్ని అమితంగా ప్రేమించే భ్రమరాంబను కజిన్ బ్రదర్ పెళ్లిలో చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు శివ(నాగ చైతన్య). అలా భ్రమరాంబతో ప్రేమలో పడిన శివ.. ఆదికి తన తండ్రి కృష్ణ(జగపతి బాబు) కి గొడవ ఉందని ఆ గొడవే తన ప్రేమకు అడ్డుగా మారిందని తెలుసుకుంటాడు.ఇంతకీ ఆది-కృష్ణ కి ఏమవుతాడు..? వారిద్దరి మధ్య గొడవేంటి.. చివరికి శివ-భ్రమరాంబ కలిశారా లేదా అనేది స్టోరీ.

______________________________________

రాక్షసుడు

నటీనటులు : సూర్య, నయనతార

ఇతర నటీనటులు : ప్రేమ్గీ అమరేన్, ప్రణీత సుభాష్, ప్రతిభాన్, రియాజ్ ఖాన్, సముథిరఖని, శరత్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ : వెంకట్ ప్రభు

ప్రొడ్యూసర్ : K.E. జ్ఞానవేల్ రాజా

రిలీజ్ డేట్ : 29  మే 2015

సూర్య కరియర్ లోనే డిఫెరెంట్ సినిమాగా నిలిచింది రాక్షసుడుసూర్య డ్యూయల్ రోల్ లో నటించిన  సినిమా అటు తమిళం లోను, తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అయిందిఆత్మగా నటించిన సూర్య పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచిందినయనతార  సినిమాలో హీరోయిన్ గా నటించింది.