మహేష్ సరసన కీర్తి సురేష్

Wednesday,February 08,2017 - 02:20 by Z_CLU

తెలుగులో ఇప్పటికే రెండు సూపర్ హిట్స్ కొట్టేసింది కీర్తిసురేష్. నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ మూవీతో పాటు తాజాగా నేను లోకల్ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకుంది. త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన కూడా నటించనుంది. ఈ క్రేజీ ఆఫర్ తో పాటు మరో బంపర్ ఆఫర్ కు అడుగు దూరంలో ఉంది కీర్తి సురేష్.

అతి త్వరలో కొరటాాల శివ దర్శకత్వంలో  ఓ సినిమా చేయబోతున్నాడు మహేష్ బాబు. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను అనుకుంటున్నారు. ఇలా ఒకేేసారి పవన్-మహేష్ లాంటి బిగ్ స్టార్స్ సరసన నటించే ఛాన్స్ అందుకుంటోంది కీర్తి సురేష్. నిజానికి కీర్తి సురేష్ కు గతంలోనే ఓసారి మహేష్ మూవీ ఛాన్స్ వచ్చింది. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న సినిమా కోసం పరిణీతి చోప్రా లేదా కీర్తి సురేష్ లో ఒకర్ని తీసుకుందామని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల కీర్తికి ఛాన్స్ దక్కలేదు. ఇప్పుడు కొరటాాల శివ సినిమా కోసం మరోసారి కీర్తి సురేష్ ను సంప్రదిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు-తమిళ భాషల్లో బిజీగా ఉంది. తెలుగులో పవన్-త్రివిక్రమ్ సినిమాకు కాల్షీట్లు కేటాయించిన కీర్తి… తమిళ్ లో మరో 2 సినిమాలు చేస్తోంది. మహేష్ మూవీలో కీర్తి సురేష్ ఉందా లేదా అనే విషయం మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.