కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న నేను లోకల్

Wednesday,February 08,2017 - 03:36 by Z_CLU

నేను లోకల్ అకౌంట్ లో నంబర్స్ వరసగా పెరుగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 3 న రిలీజైన నేను లోకల్ రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతున్న కలెక్షన్స్ తో క్రేజీ రికార్డ్స్ ని క్రియేట్ చేస్తూనే ఉంది.

ఫిబ్రవరి 7 కల్లా వరల్డ్ వైడ్ గా 20 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన నేను లోకల్, నాని కరియర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. బ్యాక్ టు బ్యాక్ హిట్ గ్యారంటీ ఫార్ములాతో దూసుకుపోతున్న నాని, నేను లోకల్ తో పక్కా కమర్షియల్ హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు.

nani-nenu-local-keerthy-suresh

హిల్లేరియస్ ఎలిమెంట్స్ తో, అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ఎట్రాక్ట్ చేస్తున్న నేను లోకల్, ఈ వీకెండ్ కూడా మరిన్ని కలెక్షన్స్ బ్యాగ్ లో వేసుకోవడం గ్యారంటీ అని ఫిక్స్ అయ్యాయి ట్రేడ్ వర్గాలు. త్రినాధ రావు నక్కిన డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు.