అమెరికాకి బయల్దేరిన పవర్ స్టార్

Wednesday,February 08,2017 - 01:05 by Z_CLU

పవర్ స్టార్ అమెరికాకి బయలుదేరాడు. ట్రెమెండస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ అతి తక్కువ కాలంలోనే తెలుగు రాష్ట్రాల్లో యూత్ ఐకాన్ గా ఎదిగాడు. అలాంటి పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం USA లోని హార్డ్ వర్డ్ యూనివర్సిటీ లో ఇండియన్ కాన్ఫరెన్స్ 2017 లో ప్రసంగించనున్నాడు.

ప్రస్తుతం కాటమరాయుడు సినిమాతో బిజీగా పవన్ కళ్యాణ్ నెక్స్ట్ వీక్ కల్లా ఇండియాకి వచ్చేస్తాడు. ఎంతో అవసరం ఉంటే షెడ్యూల్ కి బ్రేక్ చెప్పని పవన్ కళ్యాణ్, ఇండియా వచ్చీ రాగానే మళ్ళీ సెట్స్ పైకి వచ్చేస్తాడు. ఇంకా రెండు పాటలు పూర్తి చేసుకుంటే కాటమరాయుడు కు ప్యాకప్ చెప్పినట్టేనని ఇన్ సైడ్ సోర్సెస్ ద్వారా చిన్న టాక్.

katamarayudu-zee-cinemalu

ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రతి కదలికని స్పెషల్ గా ట్రీట్ చేస్తున్న ఫ్యాన్స్ మరి హార్డ్ వర్డ్ యూనివర్సిటీలో ఇవ్వనున్న స్పీచ్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.