ఆ సెంటిమెంట్ నాకు కలిసొచ్చింది....

Wednesday,March 08,2017 - 02:04 by Z_CLU

ఇండస్ట్రీలో రకరకాల సెంటిమెంట్స్ చక్కర్లు కొడుతూ ఉంటాయి. పైకి అలాంటిదేం లేదంటూనే స్టార్స్ ఆ సెంటిమెంట్ ను గుడ్డిగా ఫాలో అయిపోతుంటారు కూడా.. అయితే అలాంటి ఓ సెంటిమెంటే అనుకోకుండా కీర్తి సురేష్ కి కలిసొచ్చింది…

‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకొని లేటెస్ట్ గా ‘నేను లోకల్’ అనే సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతలో వేసుకుంది.. ఈ రెండు సినిమాల టైటిల్స్ నేను అనే వర్డ్ తో స్టార్ట్ అవ్వడం తో కీర్తి కి నేను అనే వర్డ్ సెంటిమెంట్ అయిపోయింది.. తాజాగా ఈ విషయం గురించి కీర్తి ని అడగగా అవును తెలుగులో ‘నేను’ అనే వర్డ్ నాకో సెంటిమెంట్ అయిపోయింది.. మే బె నెక్స్ట్ సినిమా కి కూడా నేను అనే వర్డ్ తో ఉంటె హ్యాట్రిక్ అవుతుందేమో అంటూ ఈ సెంటిమెంట్ గురించి చెప్పుకొచ్చింది..