బోయపాటి తో ఫిక్స్

Wednesday,March 08,2017 - 03:20 by Z_CLU

లేటెస్ట్ గా ‘ఖైదీ నంబర్ 150’ తో రే ఎంట్రీ ఇచ్చి గ్రాండ్ హిట్ అందుకున్న మెగా స్టార్ నెక్స్ట్ సినిమాల పై ఫోకస్ పెట్టాడు.. ప్రెజెంట్ 151 సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వం లో చేయడానికి రెడీ అవుతున్న చిరు మరో వైపు తన 152 సినిమా పై కూడా ఫోకస్ పెట్టేశాడు.. వరుసగా తన సినిమాలకు సంబంధించి స్టార్ దర్శకులను లైన్ లో పెడుతూ ఆ కథల పై కూడా ఫోకస్ చేస్తున్నాడు…

ప్రస్తుతం 151 సినిమాకు ‘ఉయ్యాలా వాడ నర్సింహా రెడ్డి’ కథ ఎంచుకున్న చిరు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో పాల్గొంటూ త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పై పెట్టాలని చూస్తున్నాడు.. ఈ సినిమా తర్వాత తన 152 సినిమాను బోయపాటి తో చేయబోతున్నట్లు లేటెస్ట్ గా అనౌన్స్ చేశాడు చిరు… ఈ ఇద్దరితో పాటు పూరి తో కూడా కచ్చితంగా  ఓ సినిమా చేస్తానని ఈ ముగ్గురికి ప్రెజెంట్ ఆడియన్స్ పల్స్ బాగా తెలుసని అందుకే వీరితో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నట్లు తాజాగా ఓ సందర్భం లో చెప్పుకొచ్చాడు చిరు…